Red Teaser: Ram Pothineni’s Double Dhamaaka in RED suggests that it’s more than just a regular Thriller

Red Teaser: Ram Pothineni’s Double Dhamaaka in RED suggests that it’s more than just a regular Thriller

 

`రెడ్` టీజ‌ర్: రాపో డ‌బుల్ ధ‌మాకా ల‌వ్ థ్రిల్ల‌ర్ ట్రీట్

క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ కి స‌స్పెన్స్ ఎలిమెంట్ చాలా కీల‌కం. అస‌లేం జ‌రుగుతోంది? అన్న‌ది ముందే రివీల్ కాకూడ‌దు. ఆడియెన్ ఊహ‌కు దొరికిపోకూడదు. ఊపిరి బిగ‌బ‌ట్టి కుర్చీ అంచున కూచుని చూడ‌గ‌లిగేలా చేస్తేనే స‌క్సెస్ సాధ్యం. అలాంటి గ్రిప్ ఉన్న క్రైమ్ థ్రిల్ల‌ర్లు ఇటీవ‌ల టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ స్టోరీల‌తో హిట్లు కొట్టే ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే మ‌రో ప్ర‌య‌త్నం `రెడ్`. రామ్ పోతినేని (#రాపో) క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌ స్ర‌వంతి మూవీస్ ప‌తాకంపై స్ర‌వంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్.. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.

తాజాగా టీజ‌ర్ రిలీజైంది. టీజ‌ర్ ఆద్యంతం అస‌లేం జ‌రుగుతోంది? అన్న స‌స్పెన్స్ ఎలిమెంట్ ర‌క్తి క‌ట్టిస్తోంది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభిన‌యం ఊహ‌కంద‌ని ట్విస్టుల‌తో క్యూరియాసిటీ పెంచుతోంది. క్రైమ్ హిస్ట‌రీలో ఇలాంటి కేసు చూడ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అంటూ మొద‌లు పెట్ట‌డం ఆస‌క్తిని పెంచింది. సిద్ధార్థ్ .. ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ లైఫ్స్.. డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్స్ అంటూ లేడీ కాప్ నివేద ఇన్వెస్టిగేష‌న్ లో చెప్పేసింది కాబ‌ట్టి .. రాపో ఒక్క‌డు కాదు ఇద్ద‌రు అని భావించేందుకే స్కోప్‌ ఉంది. అయితే ఆ రెండు పాత్ర‌ల్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఇంకేదో స‌స్పెన్స్ ఎలిమెంట్ ఉంద‌ని ట్రైల‌ర్ ముగింపులో `నేనే` అనే డైలాగ్ తో క్లూ ఇచ్చేశారు? అస‌లింత‌కీ ఆ క్లూ వెన‌క ఫుల్ క్రైమ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే థియేట‌ర్ల‌లో సినిమా చూడాల్సిందే. రామ్ కెరీర్ బెస్ట్ లుక్ తో క‌నిపించ‌బోతున్నాడు ఈ సినిమాలో. రెండు డిఫ‌రెంట్ గెటప్పుల‌తో ట్రైల‌ర్ లో ఎంతో ఎనర్జిటిక్ గా క‌నిపించాడు. క్రిమిన‌ల్ గెట‌ప్ కి.. సాఫ్ట్ వేర్ వేషానికి మ‌ధ్య డిఫ‌రెన్స్ ఆక‌ట్టుకుంది. నివేద‌ థామ‌స్, మాళ‌విక శ‌ర్మ, నాజ‌ర్, అమృత అయ్య‌ర్ పాత్రల్లో ఇంటెన్సిటీ ఆక‌ట్టుకుంది. ఈ క్రేజీ సినిమాలో రెండు పాట‌ల్ని యూర‌ప్ డోల‌మైట్స్ .. ఇటలీ ప‌ర్వ‌త సానువుల్లో తెర‌కెక్కించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. స‌ముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీక‌రించిన పాట హైలైట్ గా ఉండ‌నుంది.

నిర్మాత స్ర‌వంతి ర‌వికిషోర్ మాట్లాడుతూ-“ఇదో స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్.. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్ మాత్ర‌మే కాదు.. ఇందులో చ‌క్క‌ని ల‌వ్ స్టోరి ఉంది. మ‌ద‌ర్ సెంటిమెంట్.. ఎంట‌ర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయి. ఒక పాట చిత్రీక‌ర‌ణ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.

ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్‌, దర్శకత్వం : కిశోర్‌ తిరుమల.

Red Teaser: Ram Pothineni’s Double Dhamaaka in RED suggests that it’s more than just a regular Thriller

It is very important that films belonging to thriller genre get the suspense element right. The curiosity factor should be high right from the word go.Gripping crime thrillers have been doing pretty well at the ticket counters and Ram Pothineni’s ‘Red’ has not only got the suspense elements right but also suggests that the film has more exciting things in store for the audience.The film is being directed by Kishore Tirumala and bankrolled by Sravanthi Ravikishore under Sri Sravanthi movies banner. The film is based on real incidents and it is hitting the silver screens on April 9th.

The teaser of the film is out now and hits the bullseye. It maintains the suspense factor right from the start and evokes interest. The opening dialogue states that the case that is being dealt in the film is one of the most unique cases in crime history. Siddharth and Aaditya are two different individuals who lead independent lives.But when they cross paths with a lady investigative officer Nivetha Pethuraj regarding a serious case.What happens next? These are the interesting points that were showcased in the teaser. The dialogue ‘Nene’ in the end creates more curiosity. Ram has completely transformed himself from Ismart shankar.He is seen in two different roles, while one is Siddharth,a software engineer’s, the other is Aditya,a dreaded criminal. He showed great variation between both of them. Nivetha Pethuraj, Malvika Sharma, Nazar, and Amritha Aiyer play intense and look impressive. Two songs in the film were shot in Dolomites, Europe, and Italy recently.

Sravanthi Ravikishore said “Red is not just a suspense crime thriller but also has love and other emotions for the wider audience to connect. There is good entertainment as well. Barring one song, the entire shoot has been wrapped up and post-production is in full swing. The film will be out on April 9th.”

Music: Mani Sharma
Cinematographer: Sameer Reddy
Arts: AS Prakash
Fights: Peter Heins
Editing: Junaid
Presented by: Krishna Pothineni
Producer: Sravanthi Ravikishore
Director: Kishore Tirumala.