“కళ్యాణమస్తు” చిత్రంలో నీవల్ల.. నీవల్ల.. పాట విడుదల !!!

“కళ్యాణమస్తు” చిత్రంలో  నీవల్ల.. నీవల్ల.. పాట విడుదల !!!

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి చేతులమీదుగా “కళ్యాణమస్తు” చిత్రంలో  నీవల్ల.. నీవల్ల.. పాట విడుదల !!!
 
S.M.S క్రియేషన్స్, బోయపాటి అగస్త్య ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం “కల్యాణమస్తు”. శేఖర్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా   లవ్ & యాక్షన్ చిత్రంలోని మొదటి లిరికల్ సాంగ్ ను రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు విడుదల చేశారు. ఒ. సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. R.D. ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. 
 
ఈ సందర్భంగా కృష్ణంరాజు గారు మాట్లాడుతూ…
యంగ్ టీమ్ కలిసి చేసిన  “కళ్యాణమస్తు” సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాత బోయపాటి రఘుబాబు గారు సినిమాను బాగా తీశారని తెలుస్తుంది. నీవల్ల.. నీవల్ల.. సాంగ్   చాలా బాగుంది, ముఖ్యంగా యువతకు బాగా నచ్చే విధంగా ఉంది.  ఈ చిత్రం  మా శేఖర్ కి హీరోగా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా…  సినిమా సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
కృష్ణంరాజు గారి భార్య శ్యామల దేవి గారు మాట్లాడుతూ…
“కళ్యాణమస్తు” టైటిల్  చాలా బాగుంది,  రమ్య బెహర్ పాడిన పాట చాలా బాగుంది.. ” కల్యాణ మస్తు” చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్  ఓ. సాయి గారికి, నిర్మాత బోయపాటి రఘుబాబు గారికి ఈ సినిమా మంచి పేరుతో పాటు లాభాలు తెచ్చిపెట్టాలి. శేఖర్ వర్మ, వైభవి ఈ సినిమాతో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలి. నీవల్లే.. నీవల్లే ..సాంగ్ మరియు  ధ్రువన్ సంగీతం బాగుందని తెలిపారు.
 
నటీనటులు:
శేఖర్ వర్మ, వైభవి రావ్
 
సాంకేతిక నిపుణులు:
కథ,కథనం,దర్శకత్వం: ఒ.సాయి
నిర్మాత: బోయపాటి రఘుబాబు
కెమెరామెన్: మల్లికార్జున్ నారగని
సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్