సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జోడీగా ‘మిష‌న్ మ‌జ్ను’తో ర‌ష్మికా మంద‌న్న బాలీవుడ్ ఎంట్రీ

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జోడీగా ‘మిష‌న్ మ‌జ్ను’తో ర‌ష్మికా మంద‌న్న బాలీవుడ్ ఎంట్రీ

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జోడీగా ‘మిష‌న్ మ‌జ్ను’తో ర‌ష్మికా మంద‌న్న బాలీవుడ్ ఎంట్రీ

సౌత్ బ్యూటీ, టాలీవుడ్‌లో అచిర‌కాలంలోనే అగ్ర‌శ్రేణి తార‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మికా మంద‌న్న బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న ‘మిష‌న్ మ‌జ్ను’ మూవీలో ఆమె నాయిక‌గా ఎంపిక‌య్యారు. ఈ బిగ్ ఫిల్మ్‌లో భాగం కావడంతో ఆమె ఎగ్జ‌యిట్ అవుతున్నారు.

శంత‌ను బాగ్చి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా రా ఏజెంట్‌గా న‌టిస్తున్నారు. ప‌ర్వీజ్ షేక్‌, అసీమ్ అరోరా, సుమిత్ బ‌తేజా ర‌చ‌న చేస్తున్న ‘మిష‌న్ మ‌జ్ను’ను గూల్టీ, ఆర్ఎస్‌వీపీ బ్యాన‌ర్ల‌పై అమ‌ర్ బుటాలా, గ‌రిమా మెహ‌తా, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.

య‌థార్థ ఘ‌ట‌న‌ల ప్రేర‌ణ‌తో, భార‌త‌దేశ‌పు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో ‘మిష‌న్ మ‌జ్ను’ రూపొందుతోంది.

తెలుగులో అల్లు అర్జున్‌తో ‘పుష్ప‌’, శ‌ర్వానంద్ జోడీగా ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాల‌ను ర‌ష్మిక చేస్తున్నారు.

 

Rashmika Mandanna Makes Bollywood Debut With Sidharth Malhotra’s Mission Majnu

South Beauty Rashmika Mandanna is all set to foray into Bollywood opposite Sidharth Malhotra with an upcoming film titled Mission Majnu and the actress is excited to be part of such a big project.

Sidharth plays the role of a RAW agent and Shantanu Bagchi makes his directorial debut. Mission Majnu is written by Parveez Shaikh, Aseem Arrora and Sumit Batheja. Amar Butala and Garima Mehta are producing the film together with Ronnie Screwvala under Guulty and RSVP banners.

Inspired by real events, Mission Majnu is a film on India’s most ambitious covert operation.