“రాణి” లాంటి గొప్ప కంటెంట్ ఉన్న సినిమా అందరికీ చేరువకావాలని అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేశాం – నిర్మాతలు !

“రాణి” లాంటి గొప్ప కంటెంట్ ఉన్న సినిమా అందరికీ చేరువకావాలని అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేశాం – నిర్మాతలు !

“రాణి” లాంటి గొప్ప కంటెంట్ ఉన్న  సినిమా అందరికీ చేరువకావాలని అన్ని  డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేశాం…నిర్మాతలు కిషోర్ మారి శెట్టి, నజియా షేక్

మనోహరి ఆర్ట్స్ & నజియా షేక్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్వేత వర్మ, ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిశెట్టి నటీనటులుగా రాఘవేంద్ర దర్శకత్వంలో కిషోర్ మారిశెట్టి  మరియు నజియా షేక్ లు నిర్మిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం “రాణి”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో  ఈ నెల 6 న విడుదల చేసిన  సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి  కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్,నువ్వు తోపురా డైరెక్టర్ హరిబాబు,హీరో సుధాకర్ కోమాకుల గార్లు ముఖ్య అతిథిలుగా వచ్చి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు . అనంతరం

 కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ… కోటి రూపాయలు ఒక బిజినెస్ పెట్టచ్చు కానీ ఒక మూవీని తీసి రెండు గంటల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం చాలా కష్టం.ఆ కష్టం వెనుక ఎన్నో కన్నీళ్లు ,ఆర్టిస్ట్,టెక్నిషియన్స్ కష్టం ఉంటుంది.సినిమాను ప్రేమించకపోయినా పరవాలేదు కానీ కించపరిచే విదంగా మాట్లాడకుండా ఎంకరేజ్ చెయ్యాలని అందరినీ కోరుకొంటున్నానని అన్నారు.

 నటుడు సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ… ఈ సినిమాను చిత్ర యూనిట్ అందరూ ప్యాసినెట్ గా వర్క్ చేశారు.నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఈ సినిమాను చూసి బాగుందని అన్నారు. ఇప్పుడున్న ఓ.టి.టి ఫిల్మ్ లలో ఈ మూవీ ద బెస్ట్ అవుతుంది.హిందీ లొ కూడా రిలీజ్  చేస్తున్న ఈ మూవీ రెండు బాషల్లో కూడా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు.

 నువ్వు తోపురా డైరెక్టర్ హరిబాబు మాట్లాడుతూ.. కిషోర్ నాకు 2008 నుండి తెలుసు తను ఈ సినిమా విడుదల చేయడానికి ఎంత కష్ట పడ్డాడో నాకు తెలుసు.మంచి కంటెంట్ తో వచ్చిన ఈ మూవీను చూశాను చాలా బాగుంది.టీం అంతా బాగా యాక్ట్ చేశారు..మంచి టీం ను ఫామ్ చేయడానికి ఎంతో కష్టపడాలి.కన్నడ నుండి వచ్చిన చిన్న కంటెంట్ ను మనం ఎంకరేజ్ చేస్తున్నపుడు మన కంటెంట్ ను మనం ఎంకరేజ్ చెస్తే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
ఇందులో నటించిన అందరికీ మంచి పేరు వచ్చి నిర్మాతకు ఎక్కువ లాభాలు రావాలని అన్నారు.

 ఈస్ట్ & వెస్ట్ రాజీవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రాణి క్యారెక్టర్ ఎన్నో స్త్రగుల్స్ పేస్ చేసి,ఫైట్ చేసి చివరికి ఎలా విజయం సాధించిందో..అదే విధంగా సినిమా విడుదల తర్వాత  మీకు  అదే విధమైన విజయం లభిస్తుందని అన్నారు.

 నటుడు ప్రవీణ్ యండమూరి మాట్లాడుతూ.. ఇందులో రాణి కి అపొజిట్ గా శివ క్యారెక్టర్ చేశాను.రెండు సంవత్సరాలనుండి ఈ సినిమాకోసం కష్ట పడ్డాము.ఇప్పుడు ఫైనల్ గా తెలుగు,హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాము. మేము పడ్డ కష్టమంతా ఈ రోజుతో రిలీఫ్ అయ్యింది. ఎయిర్ టెల్,హంగామా,ఎం ఎక్స్ ప్లేయర్,వి.ఐ.ఎక్స్,అమెజాన్ ఓవర్ సీస్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

 హీరోయిన్  శ్వేతా వర్మ  మాట్లాడుతూ.. ఈ రాణి సినిమా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా.ప్రతి ఆర్టిస్ట్ మంచి కథలో నటించాలనే డ్రీమ్ ఉంటుంది.ఆ అవకాశం ఈ రాణి దర్శక,నిర్మాతల వలన వచ్చింది.ఇందులో నేను నాలుగు వెరీయేషన్స్ పాత్రలు పోషించే అవకాశం కల్పించారు. తెలుగు,హిందీ భాషల్లో డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో విడుదల చేశాం. ఈ మూవీ 1గంట 35 నిమిషాల డురేషన్ ఉంటుంది .ఈ సినిమా చూసి మా టీం ను ప్రేక్షకులు ఆదరించాలని అన్నారు.

 చిత్ర దర్శకుడు రాఘవేంద్ర మాట్లాడుతూ.. 2014 ఇండస్ట్రీ కు వచ్చిన నేను రెండు షాట్ ఫిలిమ్స్ చేశాను.2017 నుండి రాణి కథ వ్రాసుకొని  చాలామందికి స్టోరీ నెరేషన్ ఇస్తే కొంతమంది రిజెక్ట్ చేశారు. టోటల్ గా టీంను సెట్ చేసుకొన్నాక నిర్మాతలను సెట్ చేసుకొని షూట్ చేశాం.కొన్ని షెడ్యూల్స్ చేసిన తరువాత  మనీ ప్రాబ్లమ్స్ అయి సినిమా ఆగిపోయింది.మళ్ళీ నిర్మాతలు దొరక్క చాలా కష్ట పడ్డాను.
మారిశెట్టి మరియు నజియా షేక్ ల సహకారం తో ఈ సినిమా పూర్తి చేశాము.ఇప్పుడున్న టైం లో థియేటర్ కంటే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తే బాగుంటుందని రాజీవ్ గారి సపోర్ట్ తో ఈ మూవీ ను ఎయిర్ టెల్,హంగామా,ఎం ఎక్స్ ప్లేయర్,వి.ఐ.ఎక్స్,అమెజాన్ ఓవర్ సీస్ లలో ఈ సినిమాను విడుదల చేశామని అన్నారు.

 చిత్ర నిర్మాత నాజియా షేక్ మాట్లాడుతూ ..మూడు సంవత్సరాల నుండి ఈ మూవీపై వర్క్ చేస్తున్నాము. దర్శకుడు ఈ కథ చెప్పగానే నచ్చి నాజియా షేక్ ప్రొడ్యూసింగ్ హౌస్ నుండి ఈ రాణి మూవీ చేయడం జరిగింది.మిడిల్ క్లాస్ అమ్మాయి మదర్ చనిపోయాక ఫాదర్ తో ఎలా స్త్రగుల్ ఉంటుందో ఆ షేడ్ నుండి ఇంకొక షేడ్ కు కన్వర్ట్ అవుతూ తను అనుకున్న డ్రీమ్ ను ఎలా నెరవేర్చుకుందనేదే  ఈ మూవీ.
కోవిడ్ మూలంగా ఈ మూవీ డిలే అవ్వడం జరిగింది.కో ప్రొడ్యూసర్ కిషోర్ మారిసెట్టి సహాయంతో ఈ మూవీ కంప్లీట్ చేయడం జరిగింది.ఇప్పుడు ఈ మూవీ అందరికీ రీచ్ అవ్వాలని అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేశామని అన్నారు.

 నిర్మాత కిషోర్ మారిసెట్టి మాట్లాడుతూ ..ఈ మూవీ కంటెంట్ నచ్చడం తో కోవిడ్ టైం లో ఈ మూవీని టెకోవర్ చేసుకొన్నాను. మా తల్లి గారి పేరు మీద మనోహరి ఆర్ట్స్ పేరుతో బ్యానర్ పెట్టి ఈ మూవీ తీస్తున్నాను.చాలా మంది రాణి ట్రైలర్ చూసి బోల్డ్ కంటెంట్ అంటున్నారు.మంచి కంటెంట్ తో అమ్మాయిలను కించ పరిచే విధంగా చూయించలేదు.ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ గా ఎలా మారింది.ఆమె ఎగినెస్ట్ గా ఎందుకు ఫైట్ చేసిందనేదే ఈ కథ.బోల్డ్ నెస్ అంటే ఏంటి అనేది చిత్రం చూస్తే ఇందులో మేము చూయించింది బోల్డ్ నెస్సా, గోల్డ్ నెస్సా,అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.మంచి కంటెంట్ ఉన్న మూవీ ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.ఈ సినిమాను విడుదల చేయడానికి చాలా మందిని కలిశాం. చివరికి రాజీవ్ గారు ముందుకు రావడంతో సినిమాను ఓ.టి.టి.ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేశాం. ఈ మూవీ అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు..

 నటీనటులు

శ్వేతా వర్మ, ప్రవీన్ యండమూరి, కిషోర్ మారిసెట్టి, అప్పాజీ అంబరిష ధర్మ, మేక రామకృష్ణ, రాజశేఖర్ అన్నింగి, సురభి శ్రావణి, సుజాత, తదితరులు ..

 సాంకేతిక నిపుణులు

సినిమా టైటిల్. ..రాణి
బ్యానర్…  మనోహరి ఆర్ట్స్ మరియు నజియా షేక్ ప్రొడక్షన్స్
నిర్మాత….కిషోర్ మారిసెట్టి మరియు నజియా షేక్
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్షన్… రాఘవేంద్ర కటారి
మ్యూజిక్… శాండీ అడ్డంకి
సినిమాటోగ్రఫీ..రామా మారుతి యం
ఎడిటర్…. జెస్విన్ ప్రబు
లిరిక్స్.. (గుండే నిండా నిప్పు అంతుకుండ): కృష్ణాజీ లిరిక్స్ (సముద్రేమ్ తలోంచెనా): లక్ష్మి ప్రియాంక (గుండే నిండా నిప్పు అంతుకుండ): ఈశ్వర్ దాతు , (సముద్రేమ్ తలోంచెనా): శాండీ అడ్డంకి, ఈశ్వర్ దత్తు
కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్: నజియా షీక్, సిందూ
పి.ఆర్.ఓ..మధు వి.ఆర్