సూపర్‌గుడ్‌ ఆర్‌.బి.చౌదరి తనయుడు విలన్‌గా ‘నిరీక్షణ’ 

సూపర్‌గుడ్‌ ఆర్‌.బి.చౌదరి తనయుడు  విలన్‌గా ‘నిరీక్షణ’ 

Ramesh is the main villain of Supergood RB Choudhary

సూపర్‌గుడ్‌ ఆర్‌.బి.చౌదరి తనయుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా ‘నిరీక్షణ’ 
సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన తనయులు రమేష్‌, జీవా తమిళ్‌, తెలుగు భాషల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘విద్యార్థి’ చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమైన రమేష్‌ ఆ తర్వాత తమిళ్‌లో పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా రమేష్‌ తెలుగులో నటించిన సినిమా ‘ఒకటే లైఫ్‌’. ఇప్పుడు హీరో రమేష్‌ ‘నిరీక్షణ’ చిత్రంలో మొదటిసారిగా మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. 
సాయిరోనక్‌, ఎనా సహా హీరోహీరోయిన్లుగా టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నిరీక్షణ’. ఈ చిత్రంలో హీరో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా శ్రద్ధా దాస్‌, సన స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. 
సాయి రోనక్‌, ఎనా సహా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి వి., సంగీతం: మంత్ర ఆనంద్‌, పాటలు: చంద్రబోస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాణం: టేక్‌ ఓకే క్రియేషన్స్‌, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ళ.