రాజమౌళి నెక్స్ట్ మహేష్ తోనే !!

రాజమౌళి నెక్స్ట్ మహేష్ తోనే !!

రాజమౌళి నెక్స్ట్ మహేష్ తోనే !!

దర్శకధీరుడిగా పేరుగాంచిన ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ సంపాదించిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి ప్రభావం వలన ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని రాబోయే మే నెల 3వ తేదీవరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దానితో అన్ని రంగాలతో పాటు సినిమా షూటింగ్స్ కూడా రద్దుకావడంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కూడా నిలిచిపోయింది.

ఇక నేడు కాసేపటి క్రితం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. తమ సినిమాకు సంబంధించి ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ని, వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నారని, అనుకున్న విధంగానే సినిమాని 2021, జనవరి 8న రిలీజ్ చేస్తాం అని చెప్పిన రాజమౌళి, తన నెక్స్ట్ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఈ క్రేజీ కాంబినేషన్ పై ఎప్పటినుండో వార్తలు ప్రచారం అవుతుండగా, నేడు దీనిపై క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. దీనితో ఒక్కసారిగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు…..!!