ఆచార్య లో పూజా హెగ్డే?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రంలో పొడుగుకాళ్ల సుంద‌రి పూజాహెగ్డే న‌టించ‌నున్న‌ట్లు టాలీవుడ్ స‌ర్కిల్్సలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ త‌ర్వాత షూటింగ్ ప్రారంభ‌మైన ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఓ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రామ్ చ‌ర‌ణ్‌కు ల‌వ‌ర్ పాత్ర కోసం పూజాహెగ్డేను చిత్రం బృందం సంప్ర‌దించింద‌ని… ఈ చిత్రంలో న‌టించేందుకు తాను ఎంతో ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలిపింద‌ని స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రంలో పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో న‌టించింది.