ఫిబ్రవరిలో ప్రేమ సాగరం 1995″ రెండో షెడ్యూల్.

సాయిశ్వర్, ప్రియాంక రేవరి జంటగా సాయి వైష్ణవి పిక్చర్స్ పతాకంపై వీ యస్ ఫణిoద్ర దర్శకత్వంలో గోపాల్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం “ప్రేమసాగరం 1995”. కంప్లీట్ లవ్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఫిబ్రవరి15 నుండి రెండో షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఈ చిత్రం టైటిల్, మోషన్ పోస్టర్న్ను ఇటీవలే నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేశారు. సుమన్, రాజా రవీంద్ర, రమ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలు కాబోతుంది.

నిర్మాత గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. మా దర్శకుడు ఫణిoద్ర చెప్పిన కథ నచ్చి ఎంతో ఇంప్రెస్ అయి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రేమకథలతో వచ్చే ప్రతి సినిమా యువతీ యువకులను ఆకట్టుకుంటుంది.. కానీ అందులో నాచులర్ గా రియలస్టిక్ గా కొత్తదనంతో ఉండాలి అప్పుడే ఆ కథ ప్రేక్షకులను రక్తికట్టిస్తుంది. అలాంటి కథే మా ప్రేమసాగరం. మొదటి షెడ్యూల్ రష్ చూశాక నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రేమకథలు రావడానికి ఇన్స్పిరేషన్ గా మా ఫిల్మ్ నిలుస్తుంది.
దర్శకుడు ఫణిoద్ర మాట్లాడుతూ… యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కి రెడి అవుతున్నాం.. అన్నారు.

ఈ చిత్రానికి:
కెమెరా: మణికంఠ, మ్యూజిక్: హర్ష ప్రవీణ్, డ్రోన్, జాన్ భాష: లిరిక్స్: శ్రీరామ్, తపస్వి, అంజన్, ఫైట్స్: పృద్వి,
డాన్స్: కపిల్, నిర్మాత: గోపాల్ నాయుడు, రచన-దర్శకత్వం:వి యస్ ఫణిoద్ర.