`పాయింట్ బ్లాంక్` మూవీ రివ్యూ !!

`పాయింట్ బ్లాంక్` మూవీ రివ్యూ !!

 

`పాయింట్ బ్లాంక్` మూవీ రివ్యూ !!

బ్యానర్ : ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్
నిర్మాత : డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్
దర్శకత్వం : వి.వి.ఎస్‌జీ
సంగీతం: సాయి పవన్
సినిమాటోగ్రఫీ : పి.సి. కన్నా
కథ: మల్లిక్ చింతకుంట
ఎడిటర్: రంజిత్ కుమార్ యర్రం
సౌండ్ ఎఫెక్ట్స్: సురేష్
గ్రాఫిక్స్: డిజిపోస్ట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎటికా నవీన్
సహ నిర్మాతలు: మల్లిక్ చింతకుంట, సుమన్ గాధంశెట్టి, దేవేంద్ర ఇంటూరి, గోపీచంద్ మ్యాచ్ , రవికిరణ్ చలిచామా

నటీనటులు : అదిరే అభి, హీనా, రేచల్, జీవా, సూర్య, ‘ఛత్రపతి’ శేఖర్, సాయి తదితరులు ..
జానర్ : క్రైం అండ్ థ్రిల్లర్
విడుదల : 29-10-2021
రేటింగ్ : 3 / 5

‘ఈశ్వర్’తో నటుడిగా పరిచయమైన అభినయ కృష్ణ. ‘జబర్దస్త్’ షో ద్వారా అదిరే అభిగా పాపులారిటీ సంపాదించారు. మంచి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు అభి హీరోగా మారారు. ‘పాయింట్ బ్లాంక్’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. మొదటి ప్రయత్నంలోనే సీరియస్ పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అభి. మరి పాయింట్ బ్లాంక్ సినిమాతో అదిరే అభి ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కమెడియన్ గా ఉన్న అభి సీరియస్ హీరోగా చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

నగరంలో జరిగిన ఓ క్రూరమైన, రహస్య హత్యలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి. ఒక మగ మరియు ఒక ఆడ మనిషి చంపబడ్డారు. అయితే ఆ ఇద్దరి డెడ్ బాడీ లలో సగం మాత్రమే ఉంచడం సంచలనం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు మృతులను గుర్తించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రిటికల్ కేసును ఛేదించేందుకు నియమించబడ్డాడు ఆదిత్య, తెలివైన మరియు ధైర్యవంతుడైన పోలీస్ అధికారి. అయితే ఈ హత్యల వెనకున్న రహస్యాన్ని ఛేదించే విషయంలో ఆదిత్య ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ హత్యల వెనకున్నది ఎవరు ? ఎందుకు అంత దారుణంగా హత్య చేసారు. ఈ కేసు పరిశోధనలో ఆదిత్య కు ఎదురైనా సవాళ్లు ఏమిటి ? వాటిని ఎలా ఛేదించాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

నటీనటుల ప్రతిభ :

నటుడిగా అదిరే అభి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కామెడిస్ షో లో ఎన్నో రకాల వేరియేషన్ ఉన్న పాత్రల్లో నవ్వించిన అభి ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా అదరగొట్టాడు. ఉత్సహం, ఆసక్తి, దైర్యం ఉన్న పోలీస్ గా నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడు. ఇక యాక్షన్ విషయంలోకూడా అభి తనకు తానుసాటి అనిపించుకున్నాడు. ఇక లవ్, హీరోయిన్ తో రొమాన్స్ లాంటి విషయాల్లో కూడా అదరగొట్టాడు. ఇక హీరోయిన్స్ గా చేసిన హీనా, రేచల్ ఇద్దరు వారి వారి పాత్రల్లో బాగా చేసారు. ముక్యంగా గ్లామర్ అంశాల్లో నువ్వా నేనా అన్న తీరుగా పోటీ పడి కనిపించారు. ఇక సీనియర్ నటుడు జీవా తనదైన నటనతో విలనిజాన్ని బాగా పండించాడు. సినిమాలో హీరోకు పవర్ ఫుల్ విలన్ ఉంటేనే ఆ హీరోయిజం పండుతుంది. అలా డ్రగ్ మాఫియా లీడర్ నర్సింగ్ దాదా గా అదరగొట్టాడు. ఇక నటుడు సూర్య డాక్టర్ భగవాన్ దాస్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ‘ఛత్రపతి’ శేఖర్ ఇందులో కీ రోల్ అని చెప్పాలి, శాడిస్ట్ హస్బెండ్ గా ఆ పాత్రలో జీవించేసాడు. అలాగే సాయి తదితరులు వారి వారి పాత్రల్లో బాగాచేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చాలా ముఖ్యం. కథను ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా సంగీతం అందించినా సాయిపవన్ టాలెంట్ మెచ్చుకోవలసిందే. సినిమాకు ఆర్ ఆర్ తో అదరగొట్టాడు. చాలా సన్నివేశాలు హైలెట్ కావడానికి మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఎడిటర్ రంజిత్ కుమార్ యర్రం తన కత్తెరకు పదును పెట్టాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. మొత్తానికి ఎడిటింగ్ విషయంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ఈ సినిమాకు మరో హైలెట్ సినిమాటోగ్రఫీ, పి.సి. కన్నా అందించిన కెమెరా సినిమాకు ప్రాణం పోసింది. సినిమాటిక్ వేవ్ లో అందించిన కెమెరా పనితనం బాగుంది. ఇక దర్శకుడు వి.వి.ఎస్‌జీ గురించి చెప్పాలంటే ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వరకు చూసినా కూడా ఓ సరికొత్త ప్రయోగంతో తీసిన పాయింట్ బ్లాంక్ తప్పకుండా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ కథల్లో చాలా వరకు ఫైనల్ గా ఏమి జరుగుతుంది అన్నది చాలా ఆసక్తిగా సాగుతుంది. అదే క‌థాను నడిపాడు దర్శకుడు, ఎక్కడా కూడా ప్రేక్షకుడిని పక్కదారి పట్టించకుండా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఇప్పటికే కమెడియన్ గా పాపులర్ అయిన అభి ని తీసుకుని ఇలాంటి సీరియస్ పాత్రలో నటింప చేసి మెప్పించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

వివ‌ర‌ణ‌ :

మర్డర్ అండ్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాయింట్ బ్లాంక్ సినిమా ఆశించిన అన్ని రకాల కామర్హియల్ హంగులతో తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇలాంటి కథల్లో కథనం చాలా ముఖ్యం ఆ విషయంలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ను చక్కగా రాసుకున్నాడు. ఎక్కడ ప్రేక్షకుడు పక్క దారి పట్టకుండా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా జాగ్రత్త పడ్డాడు. ఇక అన్ని రకాల టెక్నీకల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా బాగుంది. ముఖ్యంగా అదిరే అభి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఆకట్టుకున్నాడు . అలాగే మిగతా నటీనటులు కూడా అద్భుతంగా చేసారు. క్రైం రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు పాయింట్ బ్లాంక్ బాగా నచ్చుతుంది.