‘పంచతంత్రం’ టైటిల్ పోస్టర్, నటీనటుల వివరాలు విడుదల !!

‘పంచతంత్రం’ టైటిల్ పోస్టర్, నటీనటుల వివరాలు విడుదల !!

అడివి శేష్ చేతుల మీదగా టికెట్స్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ నిర్మిస్తున్న ‘పంచతంత్రం’ టైటిల్ పోస్టర్, నటీనటుల వివరాలు విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘పంచతంత్రం’ టైటిల్ ఖరారు చేశారు. గురువారం ఉదయం అడివి శేష్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలో నటీనటుల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు మాట్లాడుతూ “బ్రహ్మానందంగారు, ‘కలర్స్’ స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం శివాత్మిక ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘కలర్‌ ఫొటో’తో ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్‌ రాజ్‌ మా చిత్రానికి మాటలు రాయడం సంతోషంగా ఉంది. అలాగే, వరుస విజయాల్లో ఉన్న సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అని అన్నారు.

ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన… ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఐదు భావేద్వేగాల మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి” అని అన్నారు.

నటీనటులు:
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా)
అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌
ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌
సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు
క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి
మాటలు: హర్ష పులిపాక – ‘కలర్‌ ఫొటో’ సందీప్‌ రాజ్‌
పాటలు: కిట్టు విస్సాప్రగడ
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి
నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు
రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక

Title poster, cast details of ‘Panchathantram’ unveiled on Adivi Sesh’s hands

Film is produced by Ticket Factory & S Originals Production

Padmasri awardee Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, young hero Rahul Vijay and ‘Mathu Vadalara’ fame Naresh Agasthya feature in a film being produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, the film is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu.

It was in February that the film’s regular shoot began. Its title has now been confirmed as ‘Panchathantram’. On Thursday morning, Adivi Sesh unveiled the film’s title poster, which also revealed the names of the film’s cast and crew.

Speaking on the occasion, producer Srujan Yarabolu said, “We have got an ensemble cast on board. Shivathmika’s first look will be released on Thursday evening. The picturization of our movie is going on at a fast pace. Sandeep Raj, the director of ‘Colour Photo’, is penning the dialogue. Prashanth R Vihari, who has been continuously delivering successful albums, is our music director.”

Debutant director Harsha Pulipaka said, “Every living being needs the five senses for survival. The story of ‘Panchathantram’ resolves around the five senses, and is rich in five emotions. The film mirrors the thinking and attitudes of today’s youth.”

Cast:

Padmasri Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, young hero Rahul Vijay and ‘Mathu Vadalara’ fame Naresh Agasthya, Divya Sripada, Srividya, Vikas, Aadarsh Balakrishna and others.

Crew:

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media)
Associate Director: Vikram
Costume Designer: Ayesha Mariam
Editor: Garry BH
Cinematographer: Raj K Nalli
Production Controller: Sai Babu Vasireddy
Line Producer: Suneeth Padolkar
Executive Producer: Bhuvan Saluru
Creative Producer: Usha Reddy Vavveti
Dialogues: Harsha Pulipaka, ‘Colour Photo’ Sandeep Raj
Lyrics: Kittu Vissapragada
Music Director: Prashanth R Vihari
Co-Producers: Ramesh Veeragandhan, Ravali Kalangi
Producers: Akhilesh Vardhan & Srujan Yarabolu
Director: Harsha Pulipaka