‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!

‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!

సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమార్ పోటాపోటీగా నటించిన ‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!
 
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’.. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు.. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు..యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ లు పోటాపోటీగా నటించారు.. వీరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. 
 
నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్
 
సాంకేతిక నిపుణులు : 
 
ఎడిటింగ్ : సాన్ లోకేష్ 
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
సంగీతం : సిద్ధూ కుమార్
బ్యానర్ : అభిషేక్ ఫిలిమ్స్
సమర్పణ : రమేష్ పి పిళ్లై
నిర్మాత : రమేష్ పి పిళ్లై
దర్శకుడు : శశి
రిలీజ్ బై :  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ –  ఏ.ఎన్ బాలాజీ