‘టెన్త్ క్లాస్ డైరీస్’తో దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి

‘టెన్త్ క్లాస్ డైరీస్’తో దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి

‘టెన్త్ క్లాస్ డైరీస్’తో దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి

‘ది అంగ్రేజ్ ‘, ‘సీతా రాముడు’చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంజి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, శ్రీనివాసరెడ్డి తదితరుల చిత్రాలకు పని చేశారు. తమిళ, మలయాళ, హిందీ సినిమాలూ చేశారు. ‘గరుడవేగ’ సినిమా తర్వాత అదే ఆయన ఇంటి పేరు అయ్యింది. ఇప్పుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా హాఫ్ సెంచరీ కొట్టబోతున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా తన 50వ సినిమాకు ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించడం విశేషం.

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, భాను శ్రీ, నాజర్, శివాజీరాజా తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాతో ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్రీకరణ పూర్తయింది. విజయదశమి సందర్భంగా ఈ రోజు సినిమా టైటిల్, ఇతర వివరాలు వెల్లడించారు

‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ “సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తమ టెన్త్ క్లాస్ రోజులు గుర్తొస్తాయి. బ్రహ్మాండమైన కథ కుదిరింది. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమా. రెగ్యులర్‌గా ఉండదు. మా నిర్మాతలు నేను ఏది అడిగినా కాదనలేదు. హీరో హీరోయిన్లు సహా నటీనటులు సహకారంతో సినిమా అద్భుతంగా వచ్చింది. సుమారు 40 మంది ఆర్టిస్టులు చేశారు. ఫెంటాస్టిక్ టెక్నికల్ టీమ్ కుదిరింది” అని అన్నారు.

నిర్మాతలు అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం మాట్లాడుతూ “అవికా గోర్ అంటే తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాలా జంపాలా’ గుర్తొస్తుంది. కానీ, ఈ సినిమా తర్వాత ‘టెన్త్ క్లాస్ డైరీస్’ గుర్తుకు వస్తుంది. ఛాలెంజింగ్ రోల్‌లో ఎక్సట్రాడినరీ పెర్ఫార్మన్స్ కనబరిచారు. శ్రీరామ్ కీలక పాత్రలో నటించారు. హైదరాబాద్, చిక్ మంగళూరు, రాజమండ్రి, అమెరికాలో చిత్రీకరణ చేశాం. ఆల్రెడీ టైటిల్‌కు సూపర్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.

‘టెన్త్ క్లాస్ డైరీస్’
తారాగణం: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, రాజశ్రీ నాయర్ , సత్యకృష్ణ, రూపలక్ష్మి, ‘తాగుబోతు’ రమేష్, ‘చిత్రం’ శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), ‘జెమినీ’ సురేష్, ‘ఓ మై గాడ్’ నిత్య, రాహుల్, ‘కంచెరపాలెం’ కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్ రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి

సాంకేతిక నిపుణుల వివరాలు:
కథ : రామారావు, స్క్రీన్ ప్లే – డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే, విజయ్ బిన్నీ, సన్నీ, ఫైట్స్: స్టంట్స్ జాషువా, పబ్లిసిటీ డిజైనర్: అనంత్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, మేకప్: నారాయణ, కాస్ట్యూమ్స్: శ్రీదేవి కొల్లి, కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవి కొల్లిపర, నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం, సినిమాటోగ్రఫీ & దర్శకత్వం : ‘గరుడవేగ’ అంజి.

Noted Cinematographer ‘Garudavega’ Anji To Debut As A Director With ‘10th Class Diary’s’
Noted Telugu cinematographer Anji who worked on films like ‘The Angrez’ and ‘Seetha Ramudu’ had collaborated with top filmmakers like Dasari Narayana Rao, Ram Gopal Varma, Srinivas Reddy, and others. He worked on several Tamil, Malayalam, and Hindi films as well. His recent work is ‘Psv Garudavega’ which happens to be his 50th films as a cinematographer and this title eventually became his first name.

Now, ‘Garudavega’ Anji is making his directorial debut with a film titled 10th Class Diary’s. The film has Avika Gor, Sriram in the lead roles. SR Movie Makers and Anvitha Avani Kreation are bankrolling the project, while Achut ramarao P, and Ravi Teja Manyam are producing it.

The film features Srinivasa Reddy, ‘Vennela’ Ramarao, Archana, Himaja, Sivabalaji, Madhumitha, Nasser and others in the supporting roles. ‘Garudavega’ Anji is making his directorial debut with the film.

About the film, Anji said “Everyone who watches 10th Class Diary’s will roll back the days and remember the memories they had while they were in their 10th grade. We’ve worked on an excellent subject. I am sure that it offers a new experience to the viewers. Our producers gave us everything we’ve asked for. Close to 40 artists worked on the film and it has been a rewarding experience.”

The producers Achut Ramarao P and Ravi Teja Manyam said “Telugu audience remember Avika Gor for Uyyala Jampala but after 10th Class Diary’s releases, they will start recognising her with this film. She delivered an extraordinary performance in a challenging role. We shot the film in Hyderabad, Chikmangalore, Rajahmundry, and USA. More details about the film will be out soon.”
Cast:
Sriram
Avikagor
srinivas reddy
‘vennela’ ramarao
Archana (veda)
Himaja
Siva Balaji
Madhumitha
Bhanu sree
Nazar
Sivaji raja
Rajashri nair
Sathya krishna
Roopa Laksmi
thagubothu ramesh
chitram srinu
Geetha singh
Rohini (jabbardasth)
gemini suresh
‘O my god’ Nithya
Rahul
‘Kancherapalem’ Kesava
Prem
Bhavya
Kaveri
ambati srinu
Jeevan (jabardasth)
Bhasha
KA Pal ramu
Ganapathi jabardast
Rakesh jabardast
Kamal
Mahesh Machidi

Crew :
———
Banners: SR Movie Makers,
Anvitha Avani Kreation

Dop – Director
‘Garudavega’ Anji

Producers
Achut Ramarao P
Ravi Teja Manyam

co-producer
Ravi Kollipara

Music Director
Suresh Bobbili

Editor
Praveen pudi

Art Director
Krishna

Fights
stunts Jashuva

Choreography
shekhar Vj
Vijay Binny
Sunny

Lyrics
Chaitanya Prasad
Kasarla shyam
Suresh Gangula

Story
Ramarao

Screen play – Dialogues
Shruthik

Co director
Vijay kamisetty

Costumes
Sridevi Kolli

Makeup
Narayana

Production Controller
Naren G Surya

Publicity designer
Ananth ‘padmasri ads’

PRO
Pulagam chinnarayana