నాట్ ఎ కామ‌న్ మ్యాన్…ఆస‌క్తిరేపుతోన్న విశాల్31 అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ !!

నాట్ ఎ కామ‌న్ మ్యాన్…ఆస‌క్తిరేపుతోన్న విశాల్31 అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ !!

నాట్ ఎ కామ‌న్ మ్యాన్…ఆస‌క్తిరేపుతోన్న విశాల్31 అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌..

ఇటీవ‌ల చ‌క్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన యాక్ష‌న్ హీరో విశాల్  ప్ర‌స్తుతం త‌న స్నేహితుడు ఆర్యతో క‌లిసి `ఎనిమి` సినిమా చేస్తున్నారు. ఆ సినిమా త‌ర్వాత `ఈదు థెవైయో అధువే ధర్మం` అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తు.ప. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో  తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నారు. విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5గంట‌ల‌కు ఈ మూవీకి సంబందించి అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. న‌డుస్తున్న జ‌న‌సందోహం నుండి విశాల్ ఫేస్‌ని చూపించారు. దానితో పాటు నాట్ ఎ కామ‌న్ మ్యాన్(#NotACommonMan) అనే హ్యాష్ టాగ్‌ను జోడించారు. ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువ‌న్‌శంక‌ర్‌రాజా సంగీతం అందిస్తుండ‌గా బాల‌సుబ్ర‌మ‌ణ్యం సినిమాటోగ్ర‌పి భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్ట‌ర్‌, ఎన్ బి శ్రీ‌కాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు మేక‌ర్స్‌.

 
Not A Common Man… Vishal 31 Announcement Rises Curiosity

Action Hero Vishal was recently seen in Cyber Thriller ‘Chakra’. He is currently shooting for Actioner ‘Enemy’ along with his friend Arya. His latest is with Director Thu.Pa. Saravanan who shot to fame with his short film, ‘Ethu Thevayo Athuve Dharmam’. This Vishal 31 will be made as a Telugu – Tamil bilingual. Vishal is producing this film under his Vishal Film Factory banner. The official announcement regarding this film is out this evening. An interesting video is released which comprises of a huge crowd which later shapes up as Vishal’s face. This also has a hashtag #NotACommonMan which rises curiosity among the audience. Young Maestro Yuvan Shankar Raja is composing the music while Balasubramaniem is handling the camera. SS Murthy is the art director and NB Srikanth is Editor. Other details of cast and crew will be revealed soon.
 
Here it is,