`నిన్నిలా నిన్నిలా` సెకండ్ సాంగ్ విడుద‌ల

`నిన్నిలా నిన్నిలా` సెకండ్ సాంగ్  విడుద‌ల

`నిన్నిలా నిన్నిలా` సెకండ్ సాంగ్ “ప్రాణం నిల‌వ‌దే.. హృద‌యం చాల‌దె..“ను విడుద‌ల చేసిన దుల్కర్ స‌ల్మాన్‌
 
“ప్రాణం నిల‌వ‌దే.. హృద‌యం చాల‌దె..“
ఈ మాయేమిటో ఒక క్ష‌ణ‌మైన అణువంత కుదురుండ‌దె“ 
 
అని త‌న మ‌న‌సులోని ప్రేమ భావాన్ని ప్రేయ‌సి తెలియ‌జేస్తున్న ప్రియుడు గురించి తెలియాలంటే `నిన్నిలా నిన్నిలా` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు మేక‌ర్స్‌. అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు, నా కోసం..` అనే సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా శ‌నివారం ఈ సినిమాలో `ప్రాణం నిల‌వ‌దే.. హృద‌యం చాల‌దె..` అనే సాంగ్‌ను మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్కర్ స‌ల్మాన్ విడుద‌ల చేశారు.  రాజేశ్ మురుగేశ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా, యాజిన్ నిజార్‌, క‌ల్యాణి నాయ‌ర్‌, రాజేష్ మురుగ‌న్ పాడారు. 
 
న‌టీన‌టులు:
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ  త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి 
నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు.బి
సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి
సంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు:  శ్రీమ‌ణి
డైలాగ్స్‌:  నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి
ఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
డైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి
పి.ఆర్.ఒ: వ‌ంశీ కాకా