న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ‘జాతిర‌త్నాలు’ టీజ‌ర్ విడుద‌ల‌

న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ‘జాతిర‌త్నాలు’ టీజ‌ర్ విడుద‌ల‌

న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ‘జాతిర‌త్నాలు’ టీజ‌ర్ విడుద‌ల‌

న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘జాతిర‌త్నాలు’. కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

గురువారం సాయంత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా న‌వ్వులు పూయిస్తుంద‌ని టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. ముగ్గురు ప్ర‌ధాన పాత్ర‌ధారులు న‌వీన్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి జైలులో ఖైదీలుగా న‌డ‌చుకుంటూ రావ‌డంతో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ఆ న‌డ‌వ‌డంలో స్టైల్ ఉండ‌టం న‌వ్వు తెప్పించే విష‌యం. సెల్‌లో నుంచి ప్రియ‌ద‌ర్శి త‌న‌వైపు ముగ్గురు ఉన్నార‌ని.. వారు త‌మ‌న్నా, స‌మంత అని చెప్పి, మూడో పేరు కోసం త‌డుముకుంటుంటే ర‌ష్మిక అని అందిస్తాడు న‌వీన్‌.

వినోదం మాత్ర‌మే కాకుండా ఈ మూవీలో సీరియ‌స్ విష‌యం కూడా ఒక‌టి ఉంద‌ని ముర‌ళీ శ‌ర్మ ఎపిసోడ్ తెలుపుతోంది. రూ. 500 కోట్ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. న‌వీన్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంద‌నే సంగీతి ఈ టీజ‌ర్‌లో చూడొచ్చు.

ర‌ధ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి.

మార్చి 11న ‘జాతిర‌త్నాలు’ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

తారాగ‌ణం:
న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీ శ‌ర్మ‌, న‌రేష్ వి.కె., బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిశోర్‌.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కె.వి.
నిర్మాత‌:  నాగ్ అశ్విన్‌
బ్యాన‌ర్‌: స‌్వ‌ప్న సినిమా
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సిద్దం మ‌నోహ‌ర్‌
ఎడిటింగ్‌: అభిన‌వ్ రెడ్డి దండా
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
 
Naveen Polishetty, Priyadarshi and Rahul Ramakrishna’s Jathi Ratnalu Teaser Out

Naveen Polishetty, Rahul Ramakrishna and Priyadarshi have teamed up for a comedy caper Jathi Ratnalu directed by Anudeep KV and produced by Nag Ashwin under Swapna Cinema. The film will see Faria Abdullah essaying leading lady.

The film’s teaser is out and it assures a fun ride in theatres. The teaser begins with Naveen Polishetty, Priyadarshi and Rahul Ramakrishna’s entry into jail as prisoners and their buildup is mirthful. Murali Sharma’s episode hints that the film also deals with a serious subject other than fun.

Naveen Polishetty, Rahul Ramakrishna and Priyadarshi impress big time in their respective roles and the last episode of the trio teasing constable is uproarious. Music by Radhan is super cool, so is cinematography by Siddam Manohar.

Jathi Ratnalu is up for release on March 11.

Cast: Naveen Polishetty, Rahul Ramakrishna, Priyadarshi, Faria Abdullah, Murali Sharma, Naresh VK, Brahmaji, Tanikella Bharani and Vennela Kishore

Technical Crew:

Writer, Director: Anudeep KV
Producer: Nag Ashwin
Banner: Swapna Cinema
Music Director: Radhan
Cinematography: Siddam Manohar
Editing: Abhinav Reddy Danda
PRO: Vamsi-Shekar