Naveen Chandra New Movie

Naveen Chandra New Movie

Naveen Chandra New Movie

ధనుష్ లాంటి హీరోలు అరుదు – నవీన్ చంద్ర

తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర అందాల రాక్షసితో
నటుడుగా ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే … ఆ తర్వాత ఎన్నో
సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నవీన్
హీరోగానే చేయాలని ఫిక్స్ కాలేదు. అందుకే పాత్ర నచ్చితే విలన్ గా
చేయడానికి కూడా వెనకాడ్డం లేదు. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో
వచ్చిన అరవింద సమేత వీరరాఘవలో విలన్ పాత్రలో అదరగొట్టిన నవీన్ కు ఆ
తర్వాత అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఇటు హీరోగా చేస్తూనే క్యారెక్టర్
ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో నవీన్ ప్రతిభ కోలీవుడ్ లోనూ
కనిపించబోతోంది. అక్కడి స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తోన్న సినిమాలో
నవీన్ చంద్ర ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. కోలీవుడ్ లో ప్రతిష్టాత్మక
నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దురై
సెంథిల్ కుమార్ దర్శకుడు.
ఇక ఈ సినిమాలో నటించడం పట్ల నవీన్ చంద్ర తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..
‘‘ ధనుష్ తో నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
ధనుష్ ఓ గొప్ప నటుడు. తన పనేదో తను చూసుకుంటాడు. కూల్ అండ్ కామ్ గోయింగ్
స్టార్ ఆయన. మే నెల నుంచి రెండో షెడ్యూల్ కు వెళ్లబోతున్నాం. ఈ షెడ్యూల్
కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా పాత్రలోనే కాదు.. బాడీలోనూ చాలా
ట్రాన్స్ ఫర్మేషన్స్ ఉంటాయి. దర్శకుడు దురై సెంథిల్ కుమార్ వంటి
ప్రతిభావంతుడైన టెక్నీషియన్ తో పాటు ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ తో
పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు..
దురై సెంథిల్ కుమార్ గతంలో ధనుష్ తోనే కోడి(తెలుగులో ధర్మయోగిగా
వచ్చింది) అనే సూపర్ హిట్ సినిమా తీసి ఉన్నాడు. స్నేహ హీరోయిన్ గా
నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓమ్ ప్రకాష్, పోరాట దృశ్యాలను
దిలీప్ సుబ్బరాజ్ చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాతో నవీన్ చంద్ర కోలీవుడ్ లో కూడా బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే
ఆయన ప్రతిభ తెలిసిన చాలామంది స్టార్ దర్శకులు తమ సినిమాల్లో కొత్తగా
పాత్రలు క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఆయన పాత్రలు కూడా
వినిపిస్తున్నారు. కానీ నటుడుగా ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలకే ప్రాధాన్యం
ఇస్తానని చెబుతున్న నవీన్ చంద్ర తన ప్రతిభతో ఇతర భాషలకూ విస్తరించినా
ఆశ్చర్యం లేదు.
Smarter data use if you`re currently working in education, you`ll definitely recognize and possibly roll your https://themindsjournal.com/how-to-write-movie-script-tips-screenwriting/ eyes at the data buzzword.