డిసెంబర్‌లో విడుదల కానున్న న్యాచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింఘరాయ్’

డిసెంబర్‌లో విడుదల కానున్న న్యాచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింఘరాయ్’

డిసెంబర్‌లో విడుదల కానున్న న్యాచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింఘరాయ్’

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింఘరాయ్ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాహుల్  సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ పార్ట్ అద్భుతంగా ఉండబోతోంది. అందుకే  పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పట్టనుంది.

ఇప్పటికే విడుదలైన శ్యామ్ సింఘరాయ్‌గా నాని ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. సాయి పల్లవి, కృతి శెట్టిల పాత్రలను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లు అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. ఇక దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త  పోస్టర్ విడుదల చేసింది. ఇందులో వాసు పాత్రలోని నాని లుక్కును రివీల్ చేశారు. మిక్కీ జే మేయర్ తన సంగీతంతో రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్‌ను చూపించారు.

వెనకాల కాళీమాత విగ్రహం, ముందు నాని ఉన్న ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.  ఎంతో పవర్ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌ నాని అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది.  వాసు పాత్రలో నానీని ఎంతో ఇంటెన్సిటీని చూపించడంతో పోస్టర్‌పై అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో నాని బెంగాలీ కుర్రాడిగా శ్యామ్ సింఘరాయ్ పాత్రలో కనిపిస్తారు. అదే సమయంలో వాసుగా గుబురు గడ్డం, వెరైటీ హెయిర్ స్టైల్‌తో మెప్పించనున్నారు.

అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతోందని ప్రకటించారు.

విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు భారీ స్థాయిలో టీం కష్టపడుతోంది.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
కథ : సత్యదేవ్ జంగా
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్ : నవీన్ నూలి
ఫైట్స్ : రవి వర్మ
పీఆర్వో : వంశీ-శేఖర్

 
Nani’s Shyam Singha Roy To Release In Theatres This December

Natural Star Nani’s magnum opus Shyam Singha Roy’s shooting was wrapped up couple of months ago and presently the film is in post-production stages. Directed by Rahul Sankrityan, the film is high on VFX, so it will take some time to complete all the post-production formalities.

First look of Nani as Shyam Singha Roy spellbound one and all. Character introduction posters of Sai Pallavi and Krithi Shetty too got tremendous response. On the propitious occasion of Dussehra, the makers have come up with a new poster to introduce Nani’s second dimension as Vasu and also a motion poster that shows both the characters. Mickey J Meyer showed variation in music for both the characters in the motion poster.

Nani is presented in a fierce avatar in the poster with Goddess Kali Maa in the background. While Kali Maa is ferocious form of Devi, Nani looks equally intense as Vasu. While Nani appeared as a Bengali guy as Shyam Singha Roy, he looks trendy as Vasu with beard and stylish hairdo here.

The film has an intriguing caption of- ‘His Love. His Legacy and His word.’ They have also announced to release Shyam Singha Roy in December, this year.

Huge teams of VFX is working, to provide visual extravaganza.

Venkat Boyanapalli is producing the film on grand scale, without compromising on any budget.
Three beautiful heroines Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are playing female leads and several top-notch technicians working for the most anticipated film.

Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam play important roles in the film.

The Production No 1 of Niharika Entertainment has original story by Satyadev Janga. Melody songs specialist Mickey J Meyer is on board to compose soundtracks, while Sanu John Varghese cranks the camera. Naveen Nooli is the editor.

Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.

Technical Crew:
Director: Rahul Sankrityan
Producer: Venkat Boyanapalli
Banner: Niharika Entertainment
Original Story: Satyadev Janga
Music Director: Mickey J Meyer
Cinematography: Sanu John Varghese
Production Designer: Avinash Kolla
Executive Producer: S Venkata Rathnam (Venkat)
Editor: Naveen Nooli
Fights: Ravi Varma
PRO: Vamsi-Shekar