‘బంగార్రాజు’ నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల !!

‘బంగార్రాజు’ నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల !!

అక్కినేని నాగార్జున, కళ్యాణ్ కృష్ణ, జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘బంగార్రాజు’ నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల !!

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో  కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం  సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న  ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ ఇద్దరూ మరో సారి మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు.

నాగ చైతన్య బర్త్ డే ( నవంబర్ 23) సందర్బంగా టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. కానీ అంత కంటే ముందుగానే ఈ రోజు నాగ చైతన్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను  విడుదల చేశారు. చేతిలో కర్ర పట్టుకుని నాగ చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్ లెట్ ఇలా అన్ని చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది.

రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.  

లడ్డుండా అనే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకు విశేష స్పందన లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం

కథ, దర్శకత్వం  : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత :  అక్కినేని నాగార్జున
బ్యానర్స్ :  జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే :  సత్యానంద్
సంగీతం :  అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ :  యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్  : బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్.

Naga Chaitanya’s First Look In Akkineni Nagarjuna, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju Revealed

King Akkineni Nagarjuna and his son Yuva Samrat Naga Chaitanya are sharing screen space together for the second time for Bangarraju, after the most memorable film of Akkineni family Manam. The father-son duo created magic with their wonderful chemistry in Manam and it will be a treat to see them together in another special film Bangarraju, which is a sequel to Nagarjuna’s biggest blockbuster Soggade Chinni Nayana.

On the occasion of Naga Chaitanya’s birthday on November 23rd, the makers will be unleashing teaser of Bangarraju. But, before that, they have revealed first look poster of Naga Chaitanya today. Looks trendy and uber cool in yellow shirt and denims, Naga Chaitanya is seen throwing a fancy cattle prod and walking elegantly. He looks completely ecstatic here with a new hairdo and stylish beard. He also sports shades and wears a big bracelet which add stylish quotient to his look. Going by the poster, Naga Chaitanya plays a lively and dynamic role.

Billed to be a wholesome entertainer laced with good dose of romance, emotions and other commercial ingredients, Bangarraju will also feature Ramya Krishna and Krithi Shetty playing heroines opposite Nagarjuna and Naga Chaitanya respectively. Krithi’s first look as village belle Naga Lakshmi that was released recently by Naga Chaitanya impressed one and all.

Anup Rubens provides soundtracks and first single Laddunda is a chartbuster. Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd. Nagarjuna is the producer. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.

Bangarraju’s shoot is presently happening in Mysore.

Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi

Technical Crew:
Story & Direction: Kalyan Krishna Kurasala
Producer: Akkineni Nagarjuna
Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd
Screenplay: Satyanand
Music: Anoop Rubens
DOP: Yuvaraj
Art Director: Brahma Kadali
PRO: Vamsi-Shekar