పల్లెటూరి వాళ్ల‌ మ‌న‌సులు గెలుచుకున్న చిన్నోడు!!Rating: 3.5/5

పల్లెటూరి వాళ్ల‌ మ‌న‌సులు గెలుచుకున్న చిన్నోడు!!Rating: 3.5/5

 

పల్లెటూరి వాళ్ల‌ మ‌న‌సులు గెలుచుకున్న చిన్నోడు!!!

ప‌ల్లె ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటే చాలు ఆ సినిమా హిట్టైన‌ట్లే అని అంటుంటారు సినిమా పెద్ద‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో చిత్రాలు అలా స‌క్సెస్ సాధించాయి. ఆ కోవ‌లో తాజాగా ` నా వెంట ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా` చిత్రం చేరింది. ఈ నెల 14న ఆరేడు సినిమాల మ‌ధ్య విడుద‌లై విజ‌య‌వంతంగా దూసుకెళ్తోన్న చిత్రం `నా వెంట ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా`. ఎటువంటి అంచనాలు లేకుండా విడుద‌లైన గ్రామీణ నేప‌థ్య చిత్రం ప‌ల్లెటూరి ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకొని విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఈ సోమ‌వారం నుంచి అన్ని ఏరియాల్లో థియేట‌ర్స్ పెంచుతున్నారంటే సినిమా టాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. పాట‌లు, టీజ‌ర్, ట్రైల‌ర్స్ తో ఈ సినిమా మంచి బ‌జ్ ని ఏర్ప‌రుచుకుంది. చ‌క్క‌టి సంగీతం, సాహిత్యం, అంద‌మైన హీరోహీరోయిన్లు, క‌నువిందు క‌లిగించే లొకేష‌న్స్ మ‌ధ్య ఈ చిత్రాన్ని నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించారు.
తారాగ‌ణం ప‌నితీరు…
హుషారు, షికారు, రౌడిబాయ్స్ లాంటి చిత్రాల్లో న‌టించిన తేజ్ కూర‌పాటి ఈ చిత్రంలో హీరోగా న‌టించాడు. అఖిల ఆకర్ష‌ణ త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా త‌ణికెళ్ల భ‌ర‌ణిగారు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. అలాగే జీవా, జోగిబ్ర‌ద‌ర్స్ పాత్ర‌లు సినిమాకు ఎంతో ప్ల‌స్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ వంశీ ప్రకాశ్‌ అందించిన కెమెరా వర్క్ బాగుంది. సందీప్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత బలంగా మార్చింది. నందమూరి హరి ఎడిటింగ్, గణేష్ మాస్టర్, సందేపు రమేష్ కొరియోగ్రఫి బాగుంది. వెంక‌ట్ వందెల ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం సినిమాకు ప్రాణం , ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు ఎ ముల్లేటి నాగేశ్వ‌రావు చ‌క్క‌టి ప్లానింగ్ తో సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయంటున్నారు అటు ప్రేక్ష‌కులు ..ఇటు సినీ ఇండ‌స్ట్రీ జ‌నాలు.

క‌థ విష‌యానికొస్తే…
వెస్ట్ గోదావ‌రి జిల్లా రావుల పాలెంలో జ‌రిగే క‌థ ఇది. తిర‌ప‌తిలో కూడా కొంత పార్ట్ ఉంటుంది. అస‌లు ప‌రిచ‌యమే లేక‌పోయినా…హీరో హీరోయిన్స్ లింక్ పెట్టి జోగి బ్ర‌ద‌ర్స్ ఊళ్లో ఒక గాసిప్ క్రియేట్ చేస్తారు. ఈ క్ర‌మంలో హీరో అస‌లు ఆ అమ్మాయి ఎవ‌రు అని తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత క‌థ తిరుప‌తికి షిప్ట్ అవుతుంది. అక్క‌డ హీరోయ‌యిన్ ఒక భ‌యంక‌ర‌మైన ఇన్స్ డెంట్ ఫేస్ చేస్తుంది. ఆ ఇన్స్ డెంట్ ఏంటి? అస‌లు హీరో హీరోయిన్స్ తిరుప‌తి ఎందుకు వెళ్లారు? తిరిగి మ‌ళ్లీ ఈస్ట్ గోదావ‌రి వ‌చ్చారా? వీళ్ల ప్రేమ స‌క్సెస్ అయిందా? అనేది మిగ‌తా క‌థ‌.

అంతా ప్ర‌తిభావంతులే…
ద‌ర్శ‌కుడు అద్భుత‌మైన క‌థ, క‌థ‌నాల‌తో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. త‌న స్క్రీన్ ప్లే కానీ, సంభాష‌ణ‌లు కానీ ప్ర‌జంట్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా అంద‌ర్నీ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక హీరో తేజ్ కూర‌పాటి తన నటనతో సినిమాను ఫన్‌గా, ఎమోషనల్‌గా మార్చడంలో తన ప్రతిభను చాటుకొన్నారు. కీలక సన్నివేశాల్లో పరిణతితో కూడిన యాక్టింగ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో తన పాత్రలో ఒదిగిపోయాడు. కృష్ణ పాత్రలో అఖిల ఆకర్షణ కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. తేజ్, అఖిల మధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింది. ఇలా నటీన‌టులు , సాంకేతిక నిపుణులు అంతా కూడి ఒక మంచి సినిమా తీయ‌డంలో స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.

ఫైన‌ల్ గా చెప్పాలంటే…
గ్రామీణ నేపథ్యంతో లవ్, ఎమోషన్స్ స్కోప్ ఉన్న పాయింట్ ఎంచుకోవడమే కాకుండా దర్శకుడు వెంకట్ వందెల , యూత్‌ఫుల్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్‌‌గా మలిచే ప్రయత్నం అభినందనీయం. కొత్త, పాత నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చే సినిమాల్లో ఒక జెన్యూనిటీ ఉంటుంది. ఆ జెన్యూనిటీ ఈ క‌థ‌లో ఉంది. ఇందులో యూత్ , ఫ్యామిలీ, క్లాస్, మాస్ ఇలా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను న‌చ్చే అంశాలున్నాయి. ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా అని చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో ఇంత నీట్ అండ్ క్యూట్ సినిమా రాలేద‌నే చెప్పాలి. నిర్మాత‌లు క‌థ‌ని న‌మ్మి ఎక్క‌డా వెన‌కాడ‌కుండా సినిమాను తెర‌కెక్కించారు. ఇలాంటి సినిమాలు ఆద‌రిస్తే ఇంకా ఎన్నో ఇలాంటి మంచి సినిమాలు నిర్మిస్తారు నిర్మాత‌లు. కాబట్టి అభిరుచి గ‌ల నిర్మాత‌ల‌ను నిల‌బెట్టాల్సిన బాధ్యత ప్రేక్ష‌కులదే. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్.

Rating: 3.5/5

మ‌న వెంట‌ప‌డే క‌థ‌, క‌థ‌నాలు!!