మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్న యాక్టర్ ‘రవిరాజ్’

మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్న యాక్టర్ ‘రవిరాజ్’

మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్న యాక్టర్ ‘రవిరాజ్’

తనికెళ్ల భరణి రూపొందించిన ఫీచర్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేశారు నటుడు రవిరాజ్. ఇంతకీ ఎవరీ రవిరాజ్ అనుకుంటున్నారా? ‘నక్షత్రం, కిర్రాక్ పార్టీ, వినరా సోదర వీరకుమారా, హిట్’ వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రల్లో నటించిన రవిరాజ్ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఒక్క నటుడనే కాదు.. ఆయన మంచి డ్యాన్సర్ కూడా. నటుడు, డ్యాన్సరే కాదు.. మైమ్ ఆర్టిస్ట్, పర్కౌర్ అథ్లెట్ కూడా. ఇలా మల్టీ టాలెంట్ కలిగిన రవిరాజ్ ఇప్పుడు వరుస ఆఫర్లతో.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రవిరాజ్ గురించి ఇంకా చెప్పాలంటే.. ఆయన మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారి నుంచి ప్రశంసలు అందుకున్న నటి చేతన భర్తే రవిరాజ్. ప్రస్తుతం చేతన ఆర్కా మీడియా సంస్థలో రూపొందుతోన్న ఓ వెబ్ సిరీస్‌లో నటిగా చేస్తుంది. ఇక ప్రస్తుతం రవిరాజ్.. ‘మహాసముద్రం, గాడ్సే, హిట్ (హిందీ)’ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడైన తనికెళ్ళ భరణి చేసిన ఓ ఫీచర్ ఫిల్మ్‌లో రవిరాజ్ లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా రానున్నాయి. అలాగే మరి కొన్ని చిత్రాలకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా వరుస ఆఫర్లతో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్న రవిరాజ్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా తెలుగు ప్రేక్షకులకు, దర్శకనిర్మాతలకు నమస్కారం. మంచి నటుడిగా నన్ను గుర్తిస్తూ.. మంచి మంచి అవకాశాలను ఇస్తున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. నటుడిగా ఇలాగే అందరినీ మెప్పించి, ఆ కళామతల్లి రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. త్వరలో ఓ చిత్రంలో లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాను.. ఇలాగే మీ అందరూ ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.