మిస్టర్ ఎక్స్ మూవీ రివ్యూ !!

మిస్టర్ ఎక్స్ మూవీ రివ్యూ !!

మిస్టర్ ఎక్స్ మూవీ రివ్యూ !!

కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: Mr. జుబేర్
నిర్మాత: అరుణోదయ ఫిల్మ్ వర్క్స్
సంగీతం : వెంకటేష్ అద్దంకి
సినిమాటోగ్రఫీ: గోపి (అమితాబ్)
ఎడిటర్: అనిల్ కుమార్
నటీనటులు: పావని, ప్రీతీ సుందర్, పియాలో హితాండోదర్స్ తదితరులు ..
విడుదల :19నవంబర్,2021
రేటింగ్:3.25/5

జానర్ : క్రైమ్ థ్రిల్లర్.
క్రైమ్ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. భిన్నమైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో కొత్తగా చెప్పాలన్న ప్రయత్నంతో వచ్చిన చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం మిస్టర్ ఎక్స్ ? క్రైం, థ్రిల్లర్ గా భిన్నమైన కథతో వచ్చిన ఈ సినిమా డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. రివెంజ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మిస్టర్ ఎక్స్ ఎవరు ? ఆ కథేమిటి అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

స్టోరీ:
అంతర్జాతీయ నైజీరియన్ డ్రగ్ స్మగ్లర్ (నీగ్రోస్) చాలా మంది ఎయిర్ హోస్టెస్‌లను ట్రాప్ చేసి, వారి డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యాపారం కోసం వాళ్ళను వాడుకుంటారు. విమానాల ద్వారా వాళ్లతో స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. అలా బ్లాక్ మెయిల్ కి గురైన ఎయిర్ హోస్టెస్ ( ప్రీతీ సుందర్ ), పియా వారి ఉచ్చులో చిక్కుకుంటారు. మొదట్లో విమానాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి ఒప్పుకుంటుంది, దానికి కారణం డబ్బు ప్రయోజనాల కోసం అంగీకరించింది. కానీ కొంతకాలం తర్వాత, ఆమె మాదకద్రవ్యాల స్మగ్లింగ్ వ్యాపారం చేయడం గిల్టీ గా ఫీల్ అయింది. ఇలాంటి తప్పుడు పని చేయనని డ్రగ్స్ స్మగ్లర్స్ వాళ్ళు కుదరదని అనడంతో ఆమె 10 కోట్ల విలువైన డ్రగ్ మెటీరియల్‌తో పాటు పోలీసు డిపార్ట్‌మెంట్‌కు లొంగిపోవాలని ఆమె భావించింది. ఈ విషయం తెలుసుకున్న నీగ్రో స్మగ్లర్లు ఆమెను చంపేందుకు సిద్ధమయ్యారు. పక్కా ప్లాన్ వేసి ప్రీతీ సుందర్ ని చెంపేసి ఆమె ఇంటి నుండి వారి 10 కోట్ల విలువైన డ్రగ్ మెటీరియల్‌ను చేసారు. కానీ ఆ మెటీరియల్ వాళ్లకు దొరకలేదు. ఈ పరిస్థితిలో, ఎయిర్ హోస్టెస్ సోదరి, పావని USA నుండి వచ్చి, తన సోదరి హత్యకు గల కారణాలను ఒక పోలీసు అధికారి శ్రీ లోహిత్ సహాయంతో వెతకడానికి ప్రయత్నిస్తుంది. అసలు డ్రగ్స్ స్మగ్లర్లను ఆమె ఎలా హ్యాండిల్ చేసింది ? తన సోదరి హత్యకు ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంది ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించిన పావని, ప్రీతీ సుందర్ ఇద్దరు వారి వారి పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా పావని తన అక్కను చంపిన వాళ్లపై పగ తీర్చుకునే అమ్మాయిగా అటు ఎమోషన్ తో పాటు ఇటు పగ పెంచుకుని వాళ్ళను ఎలా వెదికింది, చివరికి వాళ్ళను ఎలా అంతమొందించింది అన్న విషయంలో చక్కగా చేసింది. ముక్యంగా ఆమె గ్లామర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాని భుజాన వేసుకుని మోసింది. ప్రీతి సుందర్ ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సుందర్ హెయిర్ హోస్టెస్ గా అదిరిపోయింది. అందానికి అందం, గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక మాస్క్ తో ముఖాన్ని కప్పేసి విలన్ గా నటించిన పియాలో ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో చేసిన వారు వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ చిత్రానికి మ్యూజిక్ ప్రముఖ పాత్ర పోషించింది. చాల సన్నివేశాలు కథను ముందుకు నడిపించాయి. ముక్యంగా ఆర్ ఆర్ ప్రధాన హైలెట్ అని చెప్పాలి. వెంకటేష్ అద్దంకి తనదైన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. క్రైం థ్రిల్లర్ సినిమాలకు ఈ క్రైం థ్రిల్లర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ విషయంలో గోపి అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. చాలా సీన్స్ గ్రిప్పింగ్ గా అనిపిస్తాయి. ఫైనల్ గా భిన్నమైన కథను ఎంచుకున్న దర్శకుడు జుబేర్ కథ, కథనం విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ముఖ్యముగా తాను ఎంచుకునే కథను అంతే గ్రిప్పింగ్ గా తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణలోకి వెళితే…
నైజీరియన్ నేపథ్యంతో విభిన్నమైన థ్రిల్లర్‌ని ఎంచుకున్న దర్శకుడు జుబైర్ దాన్ని అనుకున్న విధంగా తెరపైకి తేవడంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా వరుసగా సస్పెన్స్ ని కంటిన్యు చేస్తూ గ్రిప్పింగా గా కథను నడిపించాడు. చాలా సన్నివేశాలను సస్పెన్స్ అంశాలతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరింగ్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తోంది. నిర్మాణ విలువలు కథకు, దాని స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తం మీద, Mr.X చిత్రం ముగింపు సూపనోకే ఒక మంచి థ్రిల్లర్. సెకండాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్‌ను అనుసరించి మంచి కమిట్మెంట్ తో సినిమాను తెరకెక్కించిన విధానం , అలాగే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో విజయం సాధించారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే సినిమా. సో డోంట్ మిస్ దిస్ వీక్.
ఫైనల్ గా: సక్సెస్ X