బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, సంతోష్ శ్రీ‌నివాస్ ఫిల్మ్ ‘అల్లుడు అదుర్స్‌’లో మోనాల్ గ‌జ్జ‌ర్ స్పెష‌ల్ సాంగ్‌

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, సంతోష్ శ్రీ‌నివాస్ ఫిల్మ్ ‘అల్లుడు అదుర్స్‌’లో మోనాల్ గ‌జ్జ‌ర్ స్పెష‌ల్ సాంగ్‌

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, సంతోష్ శ్రీ‌నివాస్ ఫిల్మ్ ‘అల్లుడు అదుర్స్‌’లో మోనాల్ గ‌జ్జ‌ర్ స్పెష‌ల్ సాంగ్‌

‘రాక్ష‌సుడు’ లాంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.

కాగా, ‘బిగ్ బాస్ 4’ ఫేమ్ మోనాల్ గ‌జ్జ‌ర్ ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్లా ఆధ్వ‌ర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూత‌లూగించే ఈ పెప్పీ నంబ‌ర్‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఆ స్పెష‌ల్ సాంగ్‌లో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌తో పాటు చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్లొన‌బోతోంది.

పండ‌గ సీజ‌న్ల‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూసేందుకు ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్’ చిత్రం వారికి స‌రైన చాయిస్ అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ స‌ర‌స‌న నాయిక‌లుగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్, వెన్నెల కిశోర్‌, స‌త్యా కీల‌క పాత్ర‌ధారులు.

రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యా, మోనాల్ గ‌జ్జ‌ర్ (స్పెష‌ల్ అప్పీరెన్స్‌)

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: స‌ంతోష్ శ్రీ‌నివాస్‌
నిర్మాత: సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల‌
స‌మ‌ర్ప‌ణ‌: ర‌మేష్ కుమార్ గంజి
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె. ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: అవినాష్ కొల్లా
యాక్ష‌న్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

 
Monal Gajjar Special Song In Bellamkonda Sai Srinivas, Santhosh Srinivas’s Alludu Adhurs  

Young hero Bellamkonda Sai Srinivas who attained super hit with his last film Rakshasudu is working with director Santhosh Srinivas for a perfect family entertainer Alludu Adhurs. The film’s shoot is nearing completion and it is getting ready to grace the theatres for Sankranthi on January 15th.  

Family entertainers are best pick for the audience during festive seasons and Alludu Adhurs is surely going to be one of the good choices for them for this Sankranthi.  

Alludu Adhurs has many popular actors and technicians working for it. Nabha Natesh and Anu Emmanuel are the heroines opposite Bellamkonda Srinivas.  Prakash Raj and Sonu Sood are the other prominent cast.

Now, Bigg Boss fame Monal Gajjar is zeroed in for a special song to be canned in a very big set erected under the supervision of art director Avinash Kolla. While the song is scored by Devi Sri Prasad, Shekar master composes dance moves for the peppy number.

The entire lead cast of Alludu Adhurs along with Bellamkonda Srinivas and Monal Gajjar will be seen in the song.

Subrahmanyam Gorrela bankrolls the film under Sumanth Movie Productions Banner and Chota K Naidu is handling cinematography.  

Cast: Bellamkonda Sai Srinivas, Nabha Natesh, Anu Emmanuel, Prakash Raj, Sonu Sood and others.  

Technical Crew:  

Producer: Subrahmanyam Gorrela  

Director: Santhosh Srinivas  

Presents: Ramesh Kumar Ganji  

Music: Devi Sri Prasad  

Dop: Chota K Naidu  

Art: Avinash Kolla  

Action: Ram – Laxman  

Editor: Thammiraju  

PRO: Vamsi Shekar