మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప్రొడ‌క్ష‌న్ నెం.4 ప్రారంభం !!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప్రొడ‌క్ష‌న్ నెం.4 ప్రారంభం !!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప్రొడ‌క్ష‌న్ నెం.4 ప్రారంభం !!

2021లో `క్రాక్` సినిమాతో ఫ‌స్ట్ బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు. ఈ చిత్రంతో శరత్ మండవ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ ‌వుతున్నారు. శ‌ర‌త్ మండ‌వ మ‌న తెలుగు వారే… గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు రచయితగా పనిచేశారు.

రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతుంది. ర‌వితేజను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌.

ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.4గా రూపొందుతోన్న ఈ మూవీ ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా (ఏప్రిల్ 13) సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో  ప్రారంభ‌మైంది. దేవుని ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి రవితేజ క్లాప్ కొట్ట‌గా, మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత ర‌విశంక‌ర్ కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌కి అంద‌జేశారు.

ఏప్రిల్ నెల‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

తారాగ‌ణంః
ర‌వితేజ‌, దివ్యాంశ కౌశిక్

సాంకేతిక నిపుణులుః
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌త్ మండ‌వ‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
బ్యాన‌ర్‌: ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం: స్యామ్ సీఎస్‌
సినిమాటోగ్ర‌ఫి:  స‌త్య‌న్ సూర్య‌న్‌
ఆర్ట్: సాయి సురేష్‌
స్టిల్స్‌: సాయి రామ్ మాగంటి
పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్

 
Mass Maharaja Ravi Teja, Sarath Mandava, SLV Cinemas LLP Production No 4 Launched

Basking under the glory of 2021’s first blockbuster Krack, Mass Maharaja has given nod to another interesting project. He will join forces with a debut director Sarath Mandava. Though he is a Telugu, Sarath Mandava previously worked as writer for films of Venkatesh, Ajith, Kamal Haasan, Mohan Lal etc.

Although Ravi Teja committed to do films with other directors, he advanced Sarath Mandava’s movie, since he was bowled by the script. Billed to be a unique thriller with story inspired from true incidents, Ravi Teja plays a never-seen-before role in the movie.

Divyansha Koushik of Majili fame is roped in as the heroine opposite Ravi Teja in the film to be produced by Sudhakar Cherukuri under SLV Cinemas LLP. Sam CS will score music, while Sathyan Sooryan will crank the camera.

The production no 4 of SLV Cinemas LLP is launched today in film’s office. For the muhurtham shot on gods images, Ravi Teja sounded the clapboard, while Mythri Movie Makers producer Ravi Shankar switched on the camera. Producer Sudhakar Cherukuri handed over the script to director Sarath Mandava.

The film’s regular shoot will begin from this month.

Cast: Ravi Teja, Divyansha Koushik

Technical Crew:
Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas LLP
Music Director: Sam CS
DOP: Sathyan Sooryan
Art Director: Sai Suresh
Stills: Sai Ram Maganti
PRO: Vamsi-Shekar