కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమా చేయ‌డానికి రెడీ- మ‌హేష్‌ 

  కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమా చేయ‌డానికి రెడీ- మ‌హేష్‌ 

             కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమా చేయ‌డానికి రెడీ- మ‌హేష్‌ 

    కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమా చేయ‌డానికి రెడీ- మ‌హేష్‌ 

       సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన 25వ చిత్రం `మ‌హ‌ర్షి`. దిల్ రాజు, అశ్వ‌నీద‌త్, పివిపి సంయుక్తంగా నిర్మించగా   వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుద‌ల కానుంది.  ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు మ‌హేష్ బాబు. ఆ విశేషాలు ఆయ‌న మాటల్లో…
 
 ఈ స్టోరీలో మిమ్మ‌ల్ని అంత‌గా ఇంప్రెస్ చేసింది?
 వంశీ వ‌చ్చి ఈ సినిమాకు సంబంధించిన 45 నిమిషాలపాటు చెప్పిన క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది. అయితే అప్ప‌టికే నా డేట్స్ ఖాలీ గా లేక‌పోవ‌డంతో వంశీని వెయిట్ చేయ‌మ‌న్నాను. మిమ్మ‌ల్ని త‌ప్ప ఈ స్టోరీలో ఎవ‌రిని ఊహించ‌లేనంటూ ఈ సినిమా కోసం రెండేళ్లు నాకోసం వెయిట్ చేసాడు. అలా మ‌హ‌ర్షి సినిమా 25వ సినిమా అయింది.  ఇంత కాంల వెయిట్ చేసిన వంశీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 
 
మ‌హ‌ర్షిలో స్పెష‌ల్ ఏంటి?
 ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. అది అంద‌రికీ క‌చ్చితంగా కనెక్ట‌వుతుంది అన‌డంలో సందేహం లేదు. క‌చ్చితంగా సినిమా స‌మాజం పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. రిలీజ్ అయ్యాక మీరే అంటారు నిజ‌మే అని. అలాగే అంద‌రూ అన్న‌ట్లు శ్రీమంతుడు సినిమాకు ఏమీ పోలిక‌లు ఉండ‌వు. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఫిలిం. 
 
 కృష్ణ గారు సినిమా చూసారా?
 నాన్న‌గారు ఇటీవ‌ల సినిమా చూసారు. ఆయ‌న చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఆయ‌నే నాకు పెద్ద క్రిటిక్. నిజాయితీగా ఏది దాచ‌కుండా చెప్పేస్తారు. మ‌హ‌ర్షి ప‌ట్ల అందుకే చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నా. 
 
 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో పూరి పేరు చెప్ప‌క‌పోవ‌డానికి కార‌ణం??
నిజంగా ఆ కార్య‌క్ర‌మంలో పూరి, సుకుమార్ ల పేర్లు మ‌రిచిపోవ‌డం కంప్లీట్ నా మిస్టేక్. ఫ్యాన్స్ స్టేజి మీద‌కు రావ‌డంతో కొంచెం డిస్ట్ర‌బ్ అయ్యాను. సుకుమార్ నాకు మంచి మిత్రుడు అత‌డితో వ‌ర్క్ చేయ‌డానికి నేను ఎప్పుడూ రెడీ. 
 
 న్యూ డైర‌క్ట‌ర్స్ తో సినిమాలు చేయ‌రా?
 న్యూ టాలెంట్ ని ఎంక‌రేజ్ చేయ‌డానికి నేను సిద్దంగా ఉంటా. ఇంత వ‌ర‌కు ఏ ఒక్క న్యూ క‌మ‌ర్ న‌న్ను స్క్రిప్ట్ తో వ‌చ్చి క‌వ‌ల‌లేదు. కొత్త త‌ర‌హా సినిమాలు చేయాల‌న్నది ఎప్ప‌టి నుంచో నా కోరిక‌,. స‌రైన స్క్రిప్ట్ వస్తే క‌చ్చితంగా చేస్తాను. అలాగే బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ సినిమాల ద‌గ్గ‌ర నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమా చేస్తాను. 
 
 మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ డీటైల్స్?
 ప్ర‌జంట్ అనిల్ రావిపూడి తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నా. అలాగే దీని త‌ర్వాత రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నాను. వాటికి సంబంధించిన డిష్క‌స‌న్ కూడా జ‌రుగుతున్నాయి. సెట్ట‌య్యాక అధికారికంగా ప్ర‌క‌టిస్తా అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.