Maharshi Movie rating: 3/5

Maharshi Movie rating: 3/5
Maharshi Movie rating: 3/5మ‌హ‌ర్షి` మూవీ రివ్యూ!!
రేటింగ్ 3/5
 
నటీనటులు: మహేష్ బాబు, పూజా హెగ్డే, ‘అల్లరి’ నరేష్, మీనాక్షి దీక్షిత్, ప్రకాష్ రాజ్, జయసుధ, జగపతిబాబు, సాయికుమార్, రాజీవ్ కనకాల, నాజర్, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
 నిర్మాతలు: దిల్ రాజు, అశ్వినీదత్, పరమ్.వి.పొట్లూరి 
పాటలు: శ్రీమణి
కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కథనం, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేదీ: మే 9 2019
రేటింగ్ 3/5
 
 మ‌హేష్ బాబు న‌టించిన 25 వ సినిమా  `మ‌హ‌ర్షి` వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, అశ్వ‌నీద‌త్, ప‌ర‌మ్ వి పొట్లూరి నిర్మాత‌లు.  పాట‌లు, ట్రైల‌ర్స్ తో ఆక‌ర్షిస్తూ వ‌చ్చిన ఈ సినిమా  మ‌రి ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన `మ‌హ‌ర్షి` ప్రేక్ష‌కుల‌ను ఏ  మేర‌కు ఆక‌ట్టుకుందో  తెలుసుకుందాం… 
                 
 క‌థ‌లోకి వెళితే…
  అమెరికాలో  ఒరిజిన్ అనే కంపెనీ సిఈవో గా ఎన‌లేని గుర్తింపు తెచ్చుకుంటాడు రిషి కుమార్ (మ‌హేష్ బాబు) సంవ‌త్స‌రానికి 950 కోట్లు సంపాద‌న‌. మ‌రి ఇలాంటి వ్య‌క్తి అదంతా వ‌దిలి త‌న‌తో  పాటు కాలేజీలో చ‌దువుకున్న ర‌వి ( అల్ల‌రి న‌రేష్‌) కోసం ఇండియా కొస్తాడు. మ‌రి ర‌విశంక‌ర్ కోసం అంతా వ‌దులుకుని ఎందుకు వ‌చ్చాడు? ర‌వి కోసం త‌న ఊరి కోసం రిషి ఏం చేసాడు?  గెలుపు వెంట ప‌రుగెట్టే రిషి చివ‌ర‌కు ఏం తెలుసుకున్నాడు అన్న‌ది   చిత్ర క‌థాంశం.
 
ప్ల‌స్ పాయిట్స్
  మ‌హేష్ బాబు న‌ట‌న‌
 క్లైమాక్స్ లో ఇచ్చిన సందేశం
 న‌రేష్ క్యార‌క్ట‌ర్
 పూజా హెగ్డే
ఫ‌స్టాప్ స్టైలిష్ మేకింగ్
 
మైన‌స్ పాయింట్స్
  ల్యాగ్ 
 క‌థ‌లో కొత్త‌ద‌నం లోపించ‌డం
 స్ట్రాంగ్ ఎమోష‌న్స్ లేక‌పోవ‌డం
 
విశ్లేష‌ణ‌లోకి వెళితే..
  గెలుపు వెంట ప‌రుగెడుతూ ఈ క్ర‌మంలో మ‌నం ఏ మిష్ అవుతున్నాం అనేది ఫ‌స్టాఫ్ లో చూపిస్తే…సెకండాఫ్ వ‌చ్చేస‌రికి దాన్ని రైతుల వైపు తీసుకెళ్లాడు క‌థ‌ని ద‌ర్శ‌కుడు.  రైతు ప‌ట్ల మ‌నం చూపించాల్సింది సానుభూతి కాదు. రైతు అంటై మ‌నకు ఉండాల్సింది గౌర‌వం, మ‌ర్యాద‌. ఒక రైతు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాడు అంటే మ‌నకు అన్నం పెట్టే వాడిని ఒక‌రిని మిస్స‌వుతున్నామ‌నే అర్థం. కాబ‌ట్టే రైతు ని కాపాడుకోవాల్సిన బాథ్య‌త ఒక ప్ర‌భుత్వానిదే కాదు మ‌నంద‌రి పై ఉంది. రైతుల‌కు వీకెండ్స్ లో వెళ్లి మ‌నమంతా సాయ‌ప‌డాలి అనేది సందేశం సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. గెలుపు మాత్ర‌మే జీవితం అన‌కున్న ఒక కుర్రాడు త‌న మిత్రుడు కోసం వ‌చ్చి ప‌ల్లెటూళ్ల‌లోని బాధ‌లు, రైతుల స‌మ‌స్యలు తెలుసుకుని ఎలా ప్ర‌తిస్పందించాడన్న అంశం సినిమాకు ప్ర‌ధానం. ఫ‌స్టాప్ లో ద‌ర్శ‌కుడు హీరో ఎలివేష‌న్స్ బాగా తీసాడు, చాలా స్టైలిష్ గా చూపించాడు. ప‌స్టాప్ అంతా ఫ్యాన్స్  పండ‌గ చేసుకునేలా సినిమా ఉంటుంది. ఇక సెకండాఫ్ మంచి సందేశం చూపిస్తూ రైతుల‌ను ఆకట్టుకునేలా తీసాడు.  ఇక దేవి పాట‌ల్లో ప‌ద‌ర ప‌ద‌ర ప‌ద‌రా, ఇదే క‌దా పాట‌లు  రెండూ బావున్నాయి.  ఇక మ‌హేష్ భాబు మ‌హ‌ర్షి గా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడు. శ్రీమంత‌డు, భ‌ర‌త్ అనే నేను సినిమాల‌లో ఇలాంటి పాత్ర‌లు చేసిన‌ప్ప‌టికీ త‌న యాక్టింగ్ తో , మేకోవ‌ర్ తో ఎన‌ర్జీ తో మ‌హ‌ర్షి పాత్ర‌కు మ‌రింత వ‌న్నె తెచ్చాడు.  ఇక ఎమోష‌న‌ల్ క్యార‌క్ట‌ర్ లో అల్ల‌రి న‌రేష్ న‌ట‌న బావుంది. అందం, అభిన‌యంతో పూజా హెగ్డే అల‌రించింది. ఇక మిగ‌తా పాత్ర‌లు వారి పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. 
 
సూటిగా చెప్పాలంటే… 
 
  వ్య‌వ‌సాయాన్ని వ‌దిలి ప‌ట్నాల‌కు వెళ్ల‌వ‌ద్దు అంటూ ఊళ్ల‌ను ద‌త్త‌త తీసుకుని సాయం చేసే పాత్ర‌లో శ్రీమంతుడులో చూసాం. అలాగే హీరో ఎల‌వేష‌న్స్, సొసైటీ ప‌ట్ల బాధ్య‌త‌తో ఉండాలంటూ భ‌ర‌త్ అనే నేను సినిమాలో మ‌హేష్ ని చూసాం. ఇక ఈ సినిమాకు వాటికి సంబంధం లేకున్నా …ఇంత‌కు ముందు మహేష్ చేసిన పాత్ర‌లే అన్న‌ట్టుగా అనిపిస్తుంది. ఇక కాలేజ్ ఎపిసోడ్ లో మ‌హేష్ ప‌ర్ఫార్మెన్స్ , యుఎస్ లో వ‌చ్చే ఎపిసోడ్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. కాలేజ్ పాత్ర‌లో, సిఈవో గా, ఫార్మ‌ర్స్ కోస పో రాడే  వ్య‌క్తిగా ఇలా త్రీ షేడ్స్ అద్భుతంగా చేసాడు.  అల్ల‌రి న‌రేష్ భావోద్వేగం కూడిన పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక షైన‌ల్ గా ఫార్మ‌ర్స్ ని  మ‌న‌మంతా ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వాలు మాత్ర‌మే కాదు వారిని మ‌ర్యాద, గౌర‌వం ఇవ్వాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందంటూ ప్ర‌తి ఒక్క‌రికీ ఒక బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలిస్తూ ప‌ల్లెల‌వైపు ప‌య‌నించే ప్ర‌య‌త్న‌మే మ‌హ‌ర్షి.