ఏప్రిల్ 29న విడుదల కానున్న ‘మాచర్ల నియోజకవర్గం’ !!

ఏప్రిల్ 29న విడుదల కానున్న  ‘మాచర్ల నియోజకవర్గం’ !!

ఏప్రిల్ 29న విడుదల కానున్న నితిన్, ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి, శ్రేష్ట్ మూవీస్ ‘మాచర్ల నియోజకవర్గం’ !!

విభిన్న కథలు చేస్తూ అలరిస్తున్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తో
శ్రేష్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.  మాచర్ల నియోజకవర్గం సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుందని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. తన మీదకు దాడి చేసేందుకు వస్తోన్న వారిపై నితిన్ విరుచుకుపడుతుండడం ఈ పోస్టర్లో చూడొచ్చు. వేసవి సెలవులను మాచర్ల నియోజకవర్గం కరెక్ట్ గా ఉపయోగించుకోనుంది.

ఈ  పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు హైలెట్ కానున్నాయి. కృతి శెట్టి నితిన్ ప్రేమ కథ కూడా కొత్తగా ఉండబోతోంది.

నితిన్‌ను  ఇది వరకెన్నడూ చూపించని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు. అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది.

భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్‌గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచింది.

నటీనటులు : నితిన్, కృతిశెట్టి తదితరులు

సాంకేతిక బృందం
రచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
సమర్పణ: రాజ్ కుమార్ ఆకెళ్ళ
బ్యానర్ :  శ్రేష్ట్ మూవీస్.
సంగీతం  : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫర్ :  ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్ :  కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ :  జీ హరి
మాటలు :  మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్ :  సాహి సురేష్
పీఆర్ఓ : వంశీ-శేఖర్

 
Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Releasing Worldwide On April 29, 2022

Versatile actor Nithiin after a long time is playing a mass and action-packed role in his upcoming film Macherla Niyojakavargam being directed by MS Raja Shekhar Reddy. The film to be produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies in association with Aditya Movies & Entertainments is currently being shot in Hyderabad.

The makers have come up with theatrical release date of the movie, through this poster. Macherla Niyojakavargam will release worldwide in summer on April 29th, as the board on the poster reads. Looks ferocious with sparks of fire in the background, Nithiin is gearing up to take on the hooligans who are coming to attack him. Summer is definitely a big season for films release and Macherla Niyojakavargam will capitalize on long holidays.

Billed to be a pucca mass and commercial entertainer with political elements, the film features the most sought-after actress Krithi Shetty playing Nithiin’s love interest.

Director MS Raja Shekhar Reddy has prepared a powerful script to present Nithiin in a never seen before action role in the film. The movie also boasts of stellar cast and will have leading craftsmen working for it.

Mahati Swara Sagar collaborates with Nithiin for the third time, after Bheeshma and Maestro. Prasad Murella cranks the camera, while Mamidala Thirupathi provides dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor.

The title and motion poster were released couple of months ago and they raised expectations on the film.

Cast: Nithiin, Krithi Shetty and others

Technical Crew:
Written & Directed by: MS Raja Shekhar Reddy
Producers: Sudhakar Reddy, Nikitha Reddy
Presents: Raj Kumar Akella
Banner: Sreshth Movies.
Music: Mahati Swara Sagar
DOP: Prasad Murella
Editor: Kotagiri Venkateswara Rao
Line Producer: G Hari
Dialogues: Mamidala Thirupathi
Art Director: Sahi Suresh
PRO: Vamsi-Shekar