@Love Movie Opening

@Love Movie Opening

 

 స్క్రీన్‌ ప్లే  ప్రాధాన్యతతో రూపొందిన విభిన్నాత్మక చిత్రం ‘@లవ్‌’.!!


 

కొత్తదనాన్ని, కొత్తతరాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు.. ఇటీవల కాలంలో కంటెంట్‌ బావుంటే యాక్టర్స్ ఎవరనేది చూడకుండా సినిమాలను సక్సెస్‌ చేస్తున్నారు ప్రేక్షకులు. ఆ కోవలో వాస్తవానికి దగ్గరగా ఉంటూ గిరిజిన నేపథ్యంలో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా ‘@ లవ్‌’  చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీనారాయణ. టిఎమ్మెస్‌, ప్రీతమ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఎన్‌ క్రియేషన్స్‌ బేనర్స్‌ పై మహేందర్‌ సింగ్‌, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ సంయుక్తంగా నిర్మించారు. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్, శ్రీకృష్ణ, మరియు డాక్టర్‌ మారుతి సకారం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల‌లో  విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనారాయణతో తాజా సినిమా ఇంటర్వ్యూ జరిపింది. ఆ విశేషాలు ఆయన మాటల్లో…

 మీ గురించి చెప్పండి?
 మాది భద్రాద్రి జిల్లా, పాల్వంచ సమీపంలోని జగన్నాథపురం గ్రామం. చిన్నప్పటినుంచి కల్చరల్‌ యాక్టివిటీస్‌ అంటే ఇష్టం. అలా సినిమాలపై ఇంట్రస్ట్‌ ఏర్పడింది. అనుభవంకోసం పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో, స్క్రిప్ట్‌ విభాగాల్లో పనిచేశాను. ఆ అనుభవంతో సింగిల్‌ క్యారక్టర్‌తో సోషల్‌ మెసేజ్‌తో  ‘ది వూండ్’ అనే ఒక డెమో చేశాను. అందులో జీవాగారు నటించారు. ఆ షార్ట్‌ఫిలింకి ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివెల్‌లో పలు అవార్డ్స్‌ కూడా వచ్చాయి. ఆ ఉత్సాహంతో ‘@లవ్‌’ చిత్రాన్ని డైరక్ట్‌ చేస్తూ వన్‌ ఆఫ్‌ ది ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించాను.

 ‘@లవ్‌’ చిత్రం కథాంశం ఏమిటి?
 ఇది రెగ్యులర్‌ ఫార్ములా సినిమా కాదు. ఈ కథ రాసుకున్నాక ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలకు చెప్పాను. కథ నచ్చింది అనేవారు…సినిమా చేయడానికి భయపడేవారు.   ‘‘కొత్తదనం ఉన్న కథలు ఎప్పుడూ డిజప్పాయింట్‌ చేయవని అందరూ అంటుంటారు…కానీ, అలాంటి కథలు చెబితే మాత్రం తీయడానికి వెనకాడతారు. అందుకే నేను నా ఫ్రెండ్స్‌ ధైర్యం చేసి కథ మీద నమ్మకంతో సినిమా చేశాం.  ఇక కథ విషయానికొస్తే.. 1975 లో ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్‌స్టోరి ఇది. దీంతో పాటు ప్రజంట్‌ సిట్యుయేషన్‌లో జరిగే లవ్‌స్టోరి కూడా ఉంటుంది. రెండు ప్రేమకథలకు ఇంటర్‌ లింక్‌ ఉంటుంది. అది ఏంటన్నది తెరపై చూడాల్సిందే. గతంలో ట్రైబల్‌ ఏరియాల్లో జరిగిన కొన్ని రియల్‌ ఇన్స్‌డెంట్స్‌ తీసుకుని ఈ కథ రాసుకున్నా. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. గిరిజనుల వేషభాషలు, వాళ్ల నమ్మకాలు, ఆచారాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తూనే మనసుని తాకే ప్రేమకథని చెప్పే ప్రయత్నం చేశాం. యువత తప్పకుండా చూడాల్సిన సినిమా. కాలం మారినా కానీ, ప్రేమ విషయంలో మాత్రం ఇప్పటికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అడవుల్లో ఉండే గిరిజనులు సైతం మారారు కానీ, నాగరికత నేర్చుకున్న వారు మాత్రం ఇంకా అలాగే ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని చూపిస్తున్నాం. దీంతో పాటు ఆడపిల్లల అభిప్రాయాలకు, అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వాలి..  వారి మనసు అర్థం చేసుకుంటే ఇన్ని అవాంతరాలు ఉండవు అంటూ మహిళా సాధికారత గురించి కూడా అంతర్లీనంగా చెబుతున్నాం.

ఏయే ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు?
 మారేడుమిల్లి, పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో దాదాపు 65 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. మా  పాల్వంచ చుట్టు ప్రక్కల ఉన్న కోయగూడాల్లోకి వెళ్లి వాళ్ల వేష, భాషలు గమనించి దాన్ని తెరపై పాత్రలతో మాట్లాడించాం. ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవం ఉట్టిపడేలా మా సినిమా ఉంటుంది.

నటీనటులు గురించి చెప్పండి?
 ఎమ్మెల్యే క్యారక్టర్‌ కోసం సీనియర్‌ ఆర్టిస్ట్‌ రామరాజు గారిని తీసుకున్నాం. మిగలిన అన్ని పాత్రలకు థియేటర్, స్టేజ్‌ ఆర్టిస్స్‌లతో పాటు పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో యాక్టింగ్‌ నేర్చుకున్నవారిని, టాలెంట్‌ ఉన్న అప్ కమింగ్ ఆర్టిస్ట్స్ ని తీసుకున్నాం. అందరూ నేను రాసుకున్న పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల గురించి చెప్పండి?

 పెద్ద సినిమాల తరహాలో సినిమా క్వాలిటీ వచ్చిందంటే మా టెక్నీషియన్సే కారణం. గిరిజనులు మా సినిమా చూస్తే మరోసారి వాళ్ల గత తరాన్ని తెరపై చూపినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతారు. గిరిజనులు ఎంత హానెస్ట్‌గా ఉంటారో, సినిమా కూడా అంత హానెస్ట్‌గా తీసే ప్రయత్నం చేశాను.  ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చూశాక స్క్రీన్‌ప్లే గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటారు.  

 హిందీ, భోజ్‌పురి భాషల్లో పలు చిత్రాలకు పని చేసిన మహేందర్‌ మా సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ చేశారు. మార్తాండ వెంకటేష్‌ గారు ఎడిటింగ్‌,  యతిరాజ్‌ గారి సౌండ్‌ డిజైన్ బాగా కుదిరాయి. ఇందులో మూడు పాటలకు సన్ని మానిక్‌ ట్యూన్స్ చేశాడు. ఇక ప్రమోషనల్‌ సాంగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు రామ్‌చరణ్‌ చేశాడు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మిలియన్స్‌లో వ్యూస్‌ వచ్చాయి. ముఖ్యంగా మా సినిమాలో యాక్సెంట్‌ అతి పెద్ద ఎస్సెట్‌ అన్నారు.

 సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నారు?
ఈ నెల‌లోనే  సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం.