‘శేఖర్’ ఫస్ట్ సింగిల్ “లవ్ గంటే మోగిందంట” విడుదల !!

‘శేఖర్’ ఫస్ట్ సింగిల్ “లవ్ గంటే మోగిందంట” విడుదల !!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘శేఖర్’ ఫస్ట్ సింగిల్ “లవ్ గంటే మోగిందంట” విడుదల !!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 5న) ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

“ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా” అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్ కి చంద్రబోస్ గారి సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు.
“లవ్ గంటే మోగిందంట” అంటూ సాగే ఈ పాట యొక్క లిరికల్ వీడియోలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. మల్లికార్జున్ నరగని కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్స్ ఇస్తున్నాయి.

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సింగల్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్.

Angry star Rajasekhar’s ‘Shekar’ first single “Love Gante Mogindanta” is released
 

Angry star Rajasekhar’s 91st Movie ‘Shekar’ is being directed by Jeevita Rajasekhar. This Movie has been Presented by Vankayalapathy Murali Krishna. Under the Banners of Pegasus Cine Corp, Taurus Cine Corp, Sudhakar Impex IPL, Tripura Creations Beeram Sudhakar Reddy, Shivani Rajasekhar, Shivatmika Rajasekhar and Venkata Srinivas Boggaram are producing this Prestigious Film. The first single of the film “Love Gante Mogindanta” is released on Wednesday (January 5) through Aditya Music.

The song begins with the voiceover “Orei Nee Love Story Cheppura”. With the Music sensation Anoop Rubens catchy Tune, Chandrabose’s lyrics added soul to the “Lovely Song. This song was sung by Vijay Prakash, Anoop, and Rewanth.
Courtesy of Salt and Pepper look in the lyrical video of the song “Love Gante Mogindanta”, Rajasekhar is Looking different from his previous films. Mallikarjun’s camera visuals give a fresh feel.

“Already released promotional Posters and First Glimpse received a fantastic response from the audience. Now the first single is getting the same amount of Love from them. Post-production work is currently in the final stages. We’re preparing to release it soon.” added by the Director Mrs. Jeevita RajaSekhar on the occasion of the First Single Release.  

The film “Shekar” stars Rajasekhar, Atmiya Rajan, George Reddy Fame Muskan, Abhinav Gomatham, Kannada Kishore, Sameer, Tanikella Bharani, Ravi Verma, Shravan Raghavendra etc.

PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media), Digital Partner: Ticket Factory, Art: Sampath, Writer: Lakshmi Bhupala, Cinematography: Mallikarjun Naragani, Music: Anoop Rubens, Presentation: Vankayalapati Muralikrishna, Producers: Beeram Sudhakar Reddy, Shivani Rajasekhar, Shivatmika Rajasekhar, Venkata Srinivas Boggaram, Screenplay-Director: Jeevita Rajasekhar.