ఎన్. ఐ. ఎ ఆఫీసర్ గా కార్తికేయ !!

ఎన్. ఐ. ఎ ఆఫీసర్ గా కార్తికేయ !!

కార్తికేయ ఎన్. ఐ. ఎ ఆఫీసర్ గా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ యాక్షన్ ఎంటర్ టైనర్

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆదిరెడ్డి. టి సమర్పణ లో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ ఇందులో కథానాయిక. సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ-‘’ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో కార్తికేయ ఎన్. ఐ. ఎ. ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్ ఎనర్జీ తో ఉంటుంది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘కరుప్పన్’ లో నటించి, ప్రస్తుతం అదర్వ మురళి తో చేస్తున్న తాన్యా రవిచంద్రన్ ని ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు ఆమె. మంచి క్లాసికల్ డాన్సర్. సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ’మెంటల్ మధిలో’, ’దొరసాని’,’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్. ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం’’ అని చెప్పారు.

నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ-‘’ వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. సూపర్ స్క్రిప్ట్ ఇది. కార్తికేయ పాత్ర చిత్రణ చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికీ సగం సినిమా పూర్తైయింది. ఈ నెలాఖరు వరకు హైదరాబాదులో జరిపే షెడ్యూల్ తో 90 శాతం పూర్తవుతుంది. మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లి లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు.

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్.ఆర్.విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు,నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

Kartikeya to play NIA officer in an action entertainer helmed by Sree Saripalli

Young hero Kartikeya Gummakonda will be collaborating with Sree Saripalli for his next project, which will be produced by 88 Rama Reddy under Sree Chitra Movie Makers banner. T Adi Reddy will be presenting the film. Tanya Ravichandran plays the female lead in the action entertainer and it also stars Sudhakar Komakula in an special appearance. The unit is currently shooting a key schedule in Hyderabad.

Speaking on the occasion, the director Sree Saripalli said, “We are working on a complete action entertainer and Kartikeya will be seen as an NIA officer in this film. His character will be full of energy. We will be introducing Tanya Ravichandran who paired with Vijay Sethupathi in Tamil film Karuppan to our Telugu audiences with this film. She is the granddaughter of senior actor Ravichandran and is also a well-versed classical dancer. Sudhakar Komakula is also playing a pivotal role. There are a total of 4 songs in our film and Prashanth R Vihari who shot to fame with Mental Madhilo, Dorasani, and Anthariksham will be composing the music. We will be announcing the title very soon.”

The producer 88 Rama Reddy said, “We are introducing Sree Saripalli a former associate of VV Vinayak with our film. Kartikeya‘a characterisation is one of the major highlights of the actioner. We have already wrapped up close to 50% of the shoot. We will be completing majority of the shoot with the ongoing schedule in Hyderabad and the remaining 10% will be shot in Maredumilli.”

Star cast:

Kartikeya Gummakonda
Tanya Ravichandran
Sudhakar Komakula
Sai Kumar
Thanikella Bharani
Pasupathi
Harshavardhan
Surya
Gemini Suresh
Jabardasth Naveen

Technical crew:

Cinematography: PC Mouli
Music: Prashanth R Vihari
Editor: Jaswin Prabhu
Art director: Suresh Thimmiri, Sri Rup Menon
Fights: Subbu, Naba
Lyrics: Ramajogayya Sastry
VFX supervisor: Nikhil Koduru
Presented by: Adi Reddy.T
Producer: 88 Rama Reddy
Director: Sree Saripalli