K.K. Radhamohan’s New Film With Sampath Nandi’s Script, ‘Odela RailwayStation’ Second Schedule Begins

K.K. Radhamohan’s New Film With Sampath Nandi’s Script, ‘Odela RailwayStation’ Second Schedule Begins

సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్న‌`ఓదెల రైల్వేస్టేష‌న్` సెంకండ్ షెడ్యూల్ ప్రారంభం.

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. హీరోగా ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8MM బుల్లెట్, ఇండియా vs ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించనున్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఓదెలలో మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్‌. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన చిత్ర‌యూనిట్ ఈ రోజు(అక్టోబ‌ర్ 30) నుండి రెండో షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా..
చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ – “ తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా నిలిపిన ఓదెల రైల్వేస్టేషన్ సెకండ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కొన్ని కీల‌క‌మైన‌ స‌న్నివేశాల‌తో పాటు క్లైమాక్స్‌ను చిత్రీక‌రించ‌నున్నాం. ఇప్ప‌టికే డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో మీ ముందుకు తీసుకువ‌స్తాం“ అన్నారు.

మొద‌టి షెడ్యూల్‌లో కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెర‌కెక్కించ‌డం జ‌రిగింది.త‌మ గ్రామంలో సినిమాను చిత్రీకరిస్తూ ఈ మండలం గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఆనందంగా ఉంద‌ని దర్శకుడు సంపత్ నందికి ఓదెల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
స‌మ‌ర్ఫ‌ణ‌: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్,
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది,
ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.

K.K. Radhamohan’s New Film With Sampath Nandi’s Script, ‘Odela RailwayStation’ Second Schedule Begins

Sampath Nandi who has earlier delivered Superhit Films, ‘Emaini Ee Vela’ and ‘Bengal Tiger’ in Sri Sathya Sai Arts banner is now providing Story, Screenplay and Dialogues for a different crime thriller titled ‘Odela RailwayStation’ which is Presented by Smt Lakshmi Radhamohan and bankrolled by popular producer KK RadhaMohan. Ashok Teja is debuting as a Director with this film.

Vasishta Simha who played as a Hero in Superhit Kannada films Dayavittu Gamanisi, 8 MM Bullet, India vs England, Mayabazar 2016 and acted in 25 Kannada films is getting introduced as a Hero in Telugu with ‘Odela RailwayStation’. Heroine Hebah Patel is playing a different role as a village belle. This film is a different crime thriller which is based on incidents happened in a village named ‘Odela’. ‘Odela RailwayStation’ is being made with a realistic approach without any makeup, different costumes, dream sequences and songs. The Team has completed the first schedule in Odela village amidst Corona Pandemic taking all necessary precautions. Post-production works are going on a rapid pace parallelly along with shooting. Dubbing work has already been started in Hyderabad. The film unit has taken a short break due to recent heavy rainfall and started its second schedule today. On this occasion..

Producer K.K. RadhaMohan said, ” The shoot of ‘Odela RailwayStation’ has been halted due to the havoc caused by recent rains all-over Telangana. We have resumed the shoot with second schedule from today. Important scenes along with climax will be shot in this schedule. Dubbing works have been initiated. We will bring the film to the audience very soon.”

In it’s first schedule, team has canned some scenes at Odela Railwaystation and at Odela Mandal. Director Sampath Nandi thanked Odela villagers. He also expressed his happiness over filming at his own village and introducing the greatness of Odela Mandal to the world through this film.

Principal Cast involves Vasishta Simha, Hebah Patel, Sai Ronak, Pujita Ponnada, Naga Mahesh (Rangasthalam fame), Bhupal, Sri Gagan, Divya Cyrus, Surender Reddy, Priya Hegde and Others.

Cinematography: S Soundar Rajan
Music: Anup Rubens
Editing: Tammi Raju
Fights: Real Sathish
Presented By: Smt Lakshmi Radhamohan
Producer: KK RadhaMohan
Story, Screenplay, Dialogues: Sampath Nandi
Direction: Ashok Teja