అనిర్వచనీయ ఆనంద తరంగం జీ-5 ‘చదరంగం’ -ప్రైమ్ మినిష్టర్ పాత్రధారి జయశ్రీ రాచకొండ

అనిర్వచనీయ ఆనంద తరంగం జీ-5 ‘చదరంగం’ -ప్రైమ్ మినిష్టర్ పాత్రధారి జయశ్రీ రాచకొండ
 
 
 
 
అనిర్వచనీయ ఆనంద తరంగం
జీ-5 ‘చదరంగం’
-ప్రైమ్ మినిష్టర్ పాత్రధారి జయశ్రీ రాచకొండ
 
నాని నిర్మించిన ‘అ!’, చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మల్లేశం, బుర్రకథ, సీత ఆన్ ది రోడ్’ వంటి చిత్రాల్లో తను పోషించిన చిన్న చిన్న పాత్రలతోనే మంచి పేరు సంపాదించుకుని ముందుకు సాగుతున్నారు లాయర్ టర్నడ్ ఆర్టిస్ట్ జయశ్రీ రాచకొండ. ఈమె తాజాగా నటించిన ‘చదరంగం’ జీ-5 వెబ్ సిరీస్ విశేషమైన ఆదరణ పొందుతూ అందరి దృష్టినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఈమె దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన ‘వసుంధర’ అనే ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ ‘ప్రైమ్ మినిస్టర్’ పాత్ర పోషణకు ప్రత్యేక ప్రశంసలు అందుకుంటున్న జయశ్రీ రాచకొండ.. ఈ ప్రశంసలన్నీ ఈ వెబ్ సిరీస్ దర్శకులు ‘రాజ్ అనంత’కు చెందుతాయని, తాను చేసిందల్లా ఆయన చెప్పినట్లు చేయడమేనని చెబుతున్నారు. జీ-5 క్రియేటివ్ హెడ్ ‘ప్రసాద్ నిమ్మకాయల’కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఇందిరాగాంధీ వంటి పవర్ ఫుల్ లీడర్ పాత్రను పోషించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అంటున్నారు. జయశ్రీ  ప్రస్తుతం ప్రముఖ దర్శకులు వి.ఎన్. ఆదిత్య రూపొందిస్తున్న ‘వాళ్ళిద్దరి మధ్య, విఠల్ వాడి’ చిత్రాలతోపాటు పాయల్ రాజ్ పుట్ తో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాలతో తనకు మరింత గుర్తింపు లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జయశ్రీ రాచకొండ!!