జనం మెచ్చిన ‘జగన్నాటకం` మూవీ రివ్యూ!!

    జనం మెచ్చిన ‘జగన్నాటకం` మూవీ రివ్యూ!!

    జనం మెచ్చిన ‘జగన్నాటకం` మూవీ రివ్యూ!!

 

విడుద‌ల తేదీః  22-07-2022
రేటింగ్ః 3.25/5
బేన‌ర్ః వైవీకేయ‌స్ ఎంట‌ర్ ప్రైజెస్‌
ద‌ర్శ‌కుడుః రాజ్ అల్తాడ‌
నిర్మాతః బి.పెంచ‌ల‌య్య
న‌టీన‌టులుః
ఆలపాటి లక్ష్మి
కేరింత ఫేం పార్వతీశం
శ్రీను పెనుమూడి, స్వాతి మండల్,
అర్పిత లోహి, బేబీ రోషిణి ,
సాయి రెబల్, హిమజ చెల్లూరి

`జ‌గ‌న్నాట‌కం` టైటిల్ పెట్ట‌డంలోనే ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌గ‌మంతా తెలిసిన టైటిల్. టైటిల్ మాదిరిగానే ఇందులో పాట‌లు, ట్రైల‌ర్ కూడా సినిమా పై ఎంతో క్యూరియాసిటీని ఏర్ప‌రిచాయి. ఇక ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌నే ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

క‌థ విష‌యానికొస్తే…
ఒక‌దానికొక‌టి సంబంధ‌లేని రెండు వేరు వేరు క‌థ‌ల్లోని దారి తప్పిణ పాత్ర‌ల ప్ర‌యాణాన్ని క‌నిపించని ఒక శ‌క్తి మ‌ర‌ల ఆ పాత్ర‌ల ప్ర‌యాణాన్ని స‌రైన మార్గంలో ఎలా న‌డిపించింది??? అనేది సినిమా క‌థాంశం. అది ఎలా ? ఎంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.

అనాల‌సిస్ః
తెలిసో తెలియకో చేసిన తప్పు మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది … చేసిన తప్పు తెలుసుకుని మనం పశ్చాత్తాపం పొందినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ( దైవం ) బ్రతకడానికి ఇంకో దారి ఎలా చూపిస్తుంది… అనే ఉద్దేశ్యంతో ఈ జగన్నాటకం ముగుస్తుంది… ఇంత మంచి కధా కధనం తో కూడిన స్క్రీన్ ప్లే 70mm స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వ‌స్తాయి. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ప‌దును పెడితే సినిమా ఇంకా బాగుండేది. అక్క‌డ‌క్క‌డా మిన‌హా సినిమా ఎక్క‌డా బోర్ లేకుండా సాగుతుంది. ప్ర‌తి పాత్ర ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ప్ర‌తి పాత్ర కూడా మ‌న‌కు నిత్యం నిజ జీవితంలో ఎద‌ర‌య్యేవే కావ‌డం విశేషం.

న‌టీన‌టుల హావ‌భావాలుః
జగన్నాటకం సినిమాలో అన్నిపాత్రలు చాలా దగ్గరగా మనం చుట్టూ చూస్తున్న విధంగా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ నటి ఆలపాటి లక్ష్మి గారు చాలా సహజంగా గ్రామీణ ప్రాంతానికి తగిన విధంగా బంగారమ్మ పాత్రలో ఇమిడిపోయారు, ఇందులో కేరింత ఫేం పార్వతీశం రాజు పాత్ర కొత్త తరహాలో కనబరిచారు, కుమారస్వామి గౌతమ్ అనే ఒక మోడెరెన్ ప్లే బాయ్ పాత్రలో యువతను ఆకట్టుకునే విధంగా మంచి నటనతో మెప్పించారు, మిగిలిన వారు శ్రీను పెనుమూడి, స్వాతి మండల్, అర్పిత లోహి, బేబీ రోషిణి , సాయి రెబల్, హిమజ చెల్లూరి నూతన నటీ నటులు అయినా వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
దర్శకుడు రాజ్ అల్తాడ ఈ సినిమా కథని రాసుకున్న తీరు చాలా బాగుంది. ఇదే సినిమాకి బలం. తాను చెప్పాలనుకున్న అంశాలను నీట్‌గా, క్లీయర్‌గా తెరపై ఆవిష్కరించారు. అయితే మొదట్లో కథని కాస్త నెమ్మదిగా మొదలుపెట్టిన ఆయన ఇంటర్వెల్‌ తర్వాత వేగాన్ని పెంచారు. డ్రామా కాస్త ఎక్కువైన ఫీలింగ్‌. నూతన దర్శకుడు అవడం వలన దర్శకత్వం కొంచెం అటు ఇటుగా అనిపించినప్పటికీ మంచి డైలాగ్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. సినిమా నిడివి ఎక్కువ వలన కొంచెం తగ్గించి ఉన్నంతలో కథను క్లియర్ గా చెప్పాల్సింది . ఓవరాల్‌గా దర్శకుడిగా తన తొలి ప్రయత్నం వృధా పోలేదని చెప్పాలి. ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ పనితీరు స్క్రీన్ పైన తెలుస్తుంది. కెమెరా వర్క్ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగున్నాయి. నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు.

ఫైనల్‌గా చెప్పాలంటేః
కమర్షియాలిటీ, వినోదం అనే అంశాలు పక్కన పెట్టి చూస్తే సినిమా అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త కథలు మరియు మంచి సినిమాలు అభిమానులకు మరింతగా నచ్చుతుంది…ఒకటే చెబుతాను ప్రతి ఒక్కరు చుడాల్సిన చిత్రం, ముఖ్యంగా నేటి యువత చూసి ఏం చేయరాదో, చేయకూడదో వివరించే చిత్రం,..! డోంట్ మిస్ గో అండ్ వాచ్‌.