హీరో శ్రీ విష్ణు విడుదల చేసిన “14” చిత్రం టీజర్ !!

హీరో శ్రీ విష్ణు విడుదల చేసిన “14” చిత్రం టీజర్ !!

హీరో శ్రీ విష్ణు విడుదల చేసిన “14” చిత్రం టీజర్ !!

రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగార్, రతన్,జబర్దస్త్ మహేష్ నటీ,నటులుగా లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్న “14”. చిత్రం టీజర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ అతిరధుల సమక్షంలో ఘణంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో శ్రీ విష్ణు,ముఖ్య అతిధిగా పాల్గొని “14” చిత్రం టీజర్ ను విడుదల చేశారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

*హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ* … ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్లకు, దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శకుడు చెప్పినట్లు తన మంచి కథ తీసుకొని వస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నోయల్ కు ఈ సినిమా
మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
15 సంవత్సరాల క్రితం మేమంతా సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం .ఇప్పుడున్నటువంటి వాట్సాప్,ఫేస్ బుక్ లాంటి ఫాస్ట్ జనరేషన్ అప్పుడు లేదు. మేము ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబ్లింగ్ అయ్యేవాళ్ళం.
ఫిలింనగర్ కి మేము దూరంగా ఉన్నా.. మేము ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అందరం కలిసి ఒకే బైక్ మీద ఒకే కారులో ఆఫీస్ లకు వెళ్ళేవాళ్ళం .నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వారు వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఈ సినిమా నోయల్ కు అద్భుతమైన పేరు వచ్చి ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు

*నిర్మాత సుబ్బారావు రాయన మాట్లాడుతూ…* దసరా సందర్భంగా ఈ దుర్గాష్టమి రోజు మా టీజర్ విడుదల చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు మాకు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ మూవీ చేయడానికి ముందుకు వచ్చాము.సినిమా ఔట్ ఫుట్ బాగా రావాలని శ్రీనివాస్ మీద నమ్మకముతో వారికి ఏం కావాలో అన్ని సమకూర్చాము . సినిమా చాలా బాగా వచ్చింది.శ్రీ విష్ణు గారు మా టీజర్ కు లాంచ్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం..శ్రీ విష్ణు గారు మాకు అవకాశం ఇస్తే తనతో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నోయల్ గారితో మేము సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది . శ్రీనివాస్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు

*నిర్మాత శివకృష్ణ నిచ్చెనమెట్ల మాట్లాడుతూ ..* నాకిది మొదటి సినిమా .నోయల్ ని నేను మోషన్ పోస్టర్ లోనే కలిశాను ఆ తరువాత ఇప్పుడే కలుస్తున్నాను. నోయల్ గారు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది .శ్రీ విష్ణు సినిమాలు కూడా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ తో వస్తున్నాయి. అటువంటి తను మా కార్యక్రమానికి వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది నేను కొత్త ప్రొడ్యూసర్ అయినా చాలా కాన్ఫిడెంట్ తో ఈ సినిమా చేసాం. మంచి ఫ్రెండ్స్ అయిన శ్రీ విష్ణు, నోయల్, నవీన్,సుభాష్ గార్లకు మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుతున్నాను.మొదట దర్శకుడు శ్రీనివాస్ సినిమా గురించి చిన్న లైన్ చెప్పాడు.నాకు సినిమా గురించి నాలెడ్జ్ అస్సలు లేదు కానీ లైన్ చెప్పిన వెంటనే మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము.ఈ మూవీ అందరి అంచనాలకు మించి ఉంటుంది. మా సినిమా విడుదల తర్వాత మా సినిమాకు పనిచేసిన చిత్ర యూనిట్ అందరికీకి మంచి పేరు వస్తుందని కచ్చితంగా చెబుతున్నాను అన్నారు.

*దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ* .. మా సినిమాకు ఫస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ. నాకు ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఉండటం వల్ల సినిమా ఎక్కడా కాoప్రమైజ్ ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చేది కాదు. అలాగే నోయల్ ఈ సినిమాకు నా సొంత బ్రదర్ లా చాలా బాగా సపోర్ట్ చేశాడు. శ్రీ విష్ణు గారికి నేను ఇంతకు ముందు కథ చెప్పడం జరిగింది. తను డిఫరెంట్ మూవీస్ చేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత తను తీసే మూవీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి నేను కూడా ఎప్పుడైనా డిఫరెంట్ కథతో తన దగ్గరకు వెళ్లి సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తాను. పోసాని గారు, శ్రీకాంత్ అయ్యంగార్ మాకు లొకేషన్ లో చాలా సపోర్ట్ చేశారు .మా చిత్రంలో నటించిన వారందరూ కూడా చాలా చక్కగా నటించారు.నాకు ఇంతమంచి సినిమాలో అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

*చిత్ర హీరో నోయల్ మాట్లాడుతూ…* నిర్మాతలు మాపై నమ్మకం ఉంచి వాళ్ళ కష్టాన్ని అంతా మాపైన పెట్టారు. ఈసినిమా వారికి పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద వున్నాను అంటే దానికి కారణం రాజమౌళి గారు సుకుమార్ గార్ల వలనే వీరు అవకాశం ఇచ్చి నాకు బాగా సపోర్ట్ చేశారు . వాళ్లకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పిన సరిపోదు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ బయ్యా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మా మూవీ టీజర్ ను నా క్లోజ్ ఫ్రెండ్స్ తో టీజర్ ను రిలీజ్ చూపిస్తే బాగుంటుంది అని నేను నా ఫ్రెండ్స్ ని పిలిచాను వీరితోనే నా జర్నీ స్టార్ట్ అయింది.శ్రీ విష్ణు ఉండే స్థాయికి తను రావాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక ఫోన్ చేయగానే వచ్చాడు. ఆ రోజుల్లో మాట్లాడిన విష్ణు కి ఇప్పుడు మాట్లాడే విష్ణు కి తేడా ఏమీ లేదు.తను అలాగే స్వీట్ గా మాట్లాడుతున్నాడు.తనలో ఎటువంటి మార్పులేదు.నాకు కొంచెం పొగరు వచ్చిందేమో కాని శ్రీ విష్ణు మాత్రం అలాగే ఉన్నాడు. నవీన్ మాకీ అప్పటినుంచి బాగా సపోర్ట్ చేశాడు. నాకు ఏదైనా బాధగా ఉంటే నవీన్ కు ఫోన్ చేస్తాడు తను అంతగా నవ్విస్తాడు. నేను బాగుండాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనస్ఫూర్తిగా బాగుండాలని వాళ్ళు కొందరే ఉంటారు వాళ్లే నా ఫ్రెండ్స్. అలాగే విష్ణు కి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మా చిత్రానికి వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.తన ద్వారా మా చిత్రానికి మంచి బూస్టప్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉన్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది., మా అందరి కంటే శ్రీనివాస్ గారికి మంచి బ్రేక్ రావాలి చాలా కష్టపడి వర్క్ చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు తో చేసే అవకాశం వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు.డిఓపి సాయి గారు అద్భుతంగా చూపించారు. మా చిత్రం కోసం అందరు కూడా చాలా కష్టపడి పనిచేశాం ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు

*ఆర్టిస్ట్ నవీన్ మాట్లాడుతూ* .. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది .నోయల్, నేను, శ్రీ విష్ణు అందరూ ఓకే టైం లో జర్నీ స్టార్ట్ చేశాము. నిజంగా ప్రౌడ్ గా చెప్పుకోవాలంటే మా టీం లో శ్రీ విష్ణు సూపర్ స్టార్ అయ్యాడు కాని మాకు అవకాశాలు రాక ముందు మనకి ఎప్పుడు అవకాశాలు వస్తాయి ఇప్పుడు స్టార్ట్ అవుతాము అని ఎదురు చూసే వాళ్ళం అలాంటిది ఈ రోజు పెద్ద స్టార్ల మధ్యలో మా విష్ణు సినిమా ఆడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇదే బాటలో మా నోయల్ సినిమాలు కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. డైరెక్టర్ గారు నాకు ఇంతకు ముందు తెలుసు ట్రైలర్ చాలా బాగుంది టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

*సుభాష్ మాస్టర్ మాట్లాడుతూ* .. నవీన్ చెప్పినట్లు మేము ఈ స్టేజ్ కు చాలా కష్టపడి వచ్చాము .ఈ “14” సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడికి, నిర్మాతకు, హీరో నోయల్ కు15 సినిమాల అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

*ఆర్టిస్ట్ లోహిత్ మాట్లాడుతూ* .. “14′ టైటిలే సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది చాలా మందికి మొదట16 నుంచి టీనేజ్ స్టార్ట్ అవుతుంది ఈ సినిమా తర్వాత ఇప్పుడున్న జనరేషన్ కు 14 నుంచే టీనేజ్ స్టార్ట్ అయ్యేలా ఈ సినిమా మారుస్తుంది. ఈ “14” సినిమా ద్వారా దర్శకుడిగా ప్రతిభ కొట్టొచ్చినట్టు కనపడుతుంది తను దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దగ్గర
పని చేసి అక్కడ తన సత్తా చూపెట్టాడు ,తరువాత కరుణాకర్ దగ్గర వర్క్ చేసిన లక్ష్మి శ్రీనివాస్ గారు ఈ సినిమాతో డబ్యూ డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇంతటి టిపికల్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ తను హ్యాండిల్ చేసిన విధానం చూసి మాకే ఆశ్చర్యం వేసింది. డిఫరెంట్ మూవీస్ చేసేటటువంటి శ్రీవిష్ణు వచ్చి ఈ టీజర్ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా డీఫ్రెంట్ గా ఒక ప్రత్యేకత ఉండు కాబట్టే తను వచ్చాడు. నోయల్ కి 14 సినిమా తరువాత కెరియర్ లో తనకు 14 సినిమా అవకాశాలు రావాలి అని అన్నారు

*ఆర్టిస్ట్ కేశవ్ మాట్లాడుతూ* … ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను నోయల్ కాంబినేషన్లో, పోసాని కాంబినేషన్ లో మంచి సీన్స్ ఉన్నాయి థ్రిల్లర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా చాలా బాగా ఉంది . నాకు ఈ చిత్రంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

*నటీనటులు*
నోయల్, విశాఖ ధీమాన్, పోసాని , శ్రీకాంత్ అయ్యంగార్, రతన్, జబర్దస్త్ మహేష్, రూపాలక్ష్మి, లోహిత్ కుమార్, కేశవ్ దీపక్ తదితరులు

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ పేరు: రాయల్ పిక్చర్స్
సినిమా పేరు: “14”
దర్శకుడు: లక్ష్మి శ్రీనివాస్
నిర్మాతలు: సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చెనమెట్ల
లైన్ ప్రొడ్యూసర్స్: చంద్ర శేఖర్, తారక్ రామ్ ఈ సై
సంగీత దర్శకుడు: కళ్యాణ్
డిఒపీ: సాయినాథ్
డైలాగ్స్: ఆదిత్య భార్గవ్
ఎడిటర్: జెపి
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్
పీ.ఆర్ ఓ: బిఎ రాజు, సాయి సతీష్ పాలకుర్తి, పర్వతనేని రాంబాబు.

Hero Sree Vishnu Launched Teaser Of “14” Movie

Noel Sean, Vishakha Dhiman, Posani Krishna Murali, Srikanth Iyengar, Rathan, Jabardasth Mahesh played lead roles in an upcoming film 14 being directed by Lakshmi Srinivas and produced by Subba Rao Rayana and Sivakrishna Nichenametla under Royal Pictures banner. Hero Sree Vishnu launched the film’s teaser at Prasad Labs in Hyderabad and it is also graced by few special guests.

Hero Sree Vishnu said, “I sincerely want this film to bring a good name to the producers and director. I am ready to work with the director if he approaches me with a good story. I wish this movie will become a hit for Noel. We used to try for chances in films, 15 years ago. We used to assemble at the place of Subhash master. Naveen, Noel and Subhash are very good human beings. I wish Noel will reach next level of stardom with the film. I wish the entire team all the success.”

Producer Subba Rao Rayana said, “We are very happy to release our teaser on this Durgashtami day, on the occasion of Dussehra. We provided all the resources to director for better output, as we liked the story completely. The film has come out really well. We thank Sree Vishnu for coming to launch the teaser. If he gives chance, we are ready to make a film with Sree Vishnu. We are happy to associate with Noel. Director Srinivas worked very hard for this film.”

Producer Sivakrishna Nichenametla said, “This is my first movie. I met Noel during the launch of motion poster, and didn’t meet him after that. We are very happy that Noel dis this movie. Sree Vishnu is a big star and we are excited that he has launched the teaser. I wish good friends Sree Vishnu, Noel, Naveen, Subhash will get good projects. The film will definitely exceed your expectations.”

Director Lakshmi Srinivas said, “Story is first important thing for our film. With the support of the producers, the film has come out well. Also, Noel supported for the film like my own brother. I had already disclosed the story to Sree Vishnu. Posani and Srikanth Iyengar supported us a lot in the sets. All those who acted in our film performed well.”

Hero Noel said, “Producers trusted us and put all their hardships on us. I want this movie to be a big success for them. I am on this stage today because of Rajamouli and Sukumar who gave me good opportunities and supported me. Director Srinivas worked very hard for this film. I thank Sree Vishnu for coming to launch the teaser. There is no change in him, though he became a star now. Our film got excellent boost up, thanks to his support. This film will surely become a big hit.”

Cast: Noel Sean, Vishakha Dhiman, Posani Krishna Murali, Srikanth Iyengar, Rathan, Jabardast Mahesh, Rupa Lakshmi, Lohit Kumar, Keshav Deepak etc.

Technicians:
Banner Name: Royal Pictures
Director: Lakshmi Srinivas
Producers: Subba Rao Rayana and Sivakrishna Nichenametla
Line Producers: Chandra Shekhar, Tarak Ram Isseai
Music Director: Kalyan
DOP: Sainath
Dialogues: Aditya Bhargav
Editor: JP
Action: Dragon Prakash
PRO: BA Raju, Sai Satish Palakurthi, Parvataneni Rambabu.