జనవరి 7న `హాఫ్ స్టోరీస్` మూవీ రిలీజ్ !!

జనవరి 7న `హాఫ్ స్టోరీస్` మూవీ రిలీజ్ !!

జనవరి 7 న విడుదల కాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ `హాఫ్ స్టోరీస్` !!

నేటితరం దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు నచ్చే వెరైటీ సినిమాలు ఎంచుకుంటూ మంచి హిట్స్ సాధిస్తున్నారు. చిన్న బడ్జెట్ చిత్రాల్లో ఎక్కువగా ఈ వైవిధ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంచి కథా బలం ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘హాఫ్ స్టోరీస్’ సినిమా. శివ వరప్రసాద్ కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై యం. సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బేబీ లాలిత్య సమర్పణ లో వస్తున్న ఈ సినిమా లో రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో ఓ ప్రముఖ హీరో అతిథి పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని జనవరి 7 న విడుదల కావడానికి సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు శివ వరప్రసాద్ కె మాట్లాడుతూ..డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన హాఫ్ స్టోరీస్ సినిమా ను జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎంతో కష్టపడి ఈ సినిమా ను తెరకెక్కించాం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ఈ సినిమా ఉంటుంది. అందరు ఈ సినిమా ను చూడాలని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ సినిమాకు కూడా వస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నాం. జనవరి 7 ఈ సినిమా అందరి ముందుకు రాబోతుంది. మీ అందరిని ఈ సినిమా అలరిస్తుంది. దర్శకుడు మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కించాడు. కోటి సంగీతం సినిమాకి హైలైట్. అన్నారు.