Guna 369 movie review

Guna 369 movie review

Guna 369 movie review

సినిమా రివ్యూ: గుణ 369
రేటింగ్: 3/5

నటీనటులు: కార్తికేయ, అనఘ, ‘రంగస్థలం’ మహేష్, సీనియర్ నరేష్, శివాజీ రాజా, ‘మిర్చి’ ఆదిత్య తదితరులు 
సినిమాటోగ్రఫీ: రామ్ 
సంగీతం: చైతన్ భరద్వాజ్ 
సమర్పణ: ప్రవీణ కడియాల 
నిర్మాతలు: అనిల్ కడియాల, తిరుమల రెడ్డి 
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల 
విడుదల తేదీ: 02.08.2019

‘ఆర్.ఎక్స్. 100’తో ఒక్కసారిగా ప్రేక్షకులను, పరిశ్రమ వర్గాలను ఆకర్షించాడు కార్తికేయ. తర్వాత ‘హిప్పీ’తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. మరి, ఈ రోజు విడుదలైన ‘గుణ 369’తో విజయం సాధిస్తాడా? ‘గుణ 369’తో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున జంధ్యాల దర్శకత్వం ఎలా ఉంది? 

కథ:  గుణ (కార్తికేయ)… ఒంగోలులోని ఒక మధ్య తరగతి యువకుడు. కుటుంబం, ఉద్యోగం, సంతోషం… ఇదే అతని జీవితం. తమ కాలనీలోకి కొత్తగా వచ్చిన గీత (అనఘ)తో ప్రేమలో పడతాడు. జీవితం సాఫీగా సాగుతుండగా… ఒకరికి సహాయం చేయబోయి హత్య కేసులో జైలుకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి గీత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటి? అది తెలిసిన తర్వాత గుణ ఏం చేశాడు? అనేది మిగతా సినిమా! 

ప్లస్ పాయింట్స్:
కార్తికేయ నటన
స్క్రీన్ ప్లే, ట్విస్టులు
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్:
ఫస్టాప్
లవ్ ట్రాక్
మ్యూజిక్

విశ్లేషణ: 
‘మనం చేసే తప్పుల వల్ల మనకు ఏం జరిగినా పర్వాలేదు కానీ… మనవాళ్లకు, మన పక్కవాళ్లకు ఎటువంటి హానీ జరగకూడదు’ అని సినిమా పార్రంభంలో ఓ వాయిస్ వినిపిస్తుంది. సినిమాలో ఆ సందేశంతో పాటు పతాక సన్నివేశాల్లో ‘సమాజంలో మహిళలకు ఎటువంటి హాని జరగకూడదు. మాహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు జరగకూడదు’ అంటే మృగాళ్లలో భయం కలిగేలా దుష్ట శిక్షణ చేయాలనే సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అలాగని, అతడు చూపించిన పరిష్కారం కొత్తది కాదు. కానీ, కథను అక్కడి వరకూ నడిపించిన తీరు కొత్తగా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలతో సాగింది. విశ్రాంతికి ముందు ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఒకటి వచ్చింది. అక్కణ్ణుంచి విశ్రాంతి తర్వాత సినిమా స్వరూపమే మారింది. అప్పటివరకూ సాదాసీదాగా ఉన్న సినిమా కాస్తా… బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ సన్నివేశాలను గుర్తు చేసే ఫైట్స్, ‘ఆర్.ఎక్స్100’లో కార్తికేయను గుర్తుచేసే ఎమోషనల్, ఇంటెన్స్ నటనతో ఉత్కంఠగా సాగింది. అసలు కథ విశ్రాంతి తర్వాతే మొదలైంది. ఒక ట్విస్ట్ తర్వాత మరొక ట్విస్ట్, ఫైట్ తో క్లైమాక్స్ కు చేరుకుంది సినిమా. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో బోయపాటి మార్క్ యాక్షన్ కనిపించింది. ఫస్టాఫ్ లో లవ్ సీన్స్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటే మరింత బావుండేది. కథలో కార్తీ ‘నా పేరు శివ’ ఛాయలు కనిపిస్తాయి. సాంగ్స్ కథకు తగ్గట్టు ఉన్నప్పటికీ… సెకండాఫ్ లో ఫైట్ కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ సాంగ్, నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.  

నటీనటుల పనితీరు: ‘ఆర్.ఎక్స్. 100’లో కథానాయకుణ్ణి మరోసారి గుర్తుచేశాడు కార్తికేయ. ఫస్టాఫ్ అంతా సాధారణ యువకుడిగా కనిపించిన కార్తికేయ, సెకండాఫ్ లో విశ్వరూపం చూపించాడు. యాక్టింగ్ పరంగా తనలో సత్తా ఎంత ఉందనేది చూపించాడు. కథానాయకుడి పెయిన్, ఎమోషన్ ప్రేక్షకులు ఫీలయ్యేలా నటించాడు. అనఘ పక్కింటి అమ్మాయిలా నటించింది. తేన పూసిన కత్తి తరహా పాత్రలో ‘రంగస్థలం’ మహేష్ మంచి నటన కనబరిచాడు. సీనియర్ నరేష్, శివాజీరాజా, ‘మిర్చి’ ఆదిత్య పాత్రలకు తగ్గట్టు నటించారు.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
యాక్షన్ ప్రియులను ఆకట్టుకునే చిత్రమిది. ‘ఆర్.ఎక్స్. 100’ మెచ్చిన ప్రేక్షకులను ఈ సినిమా కూడా మెప్పిస్తుంది. ఫస్టాఫ్ లో ప్రేమాయణం కొత్తగా లేనప్పటికీ… సెకండాఫ్ లో ఎమోషనల్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కార్తికేయ నటన ఆకట్టుకుంటుంది.