`సీటీమార్` సెట్ లో గ్రాండ్‌గా స్టార్ హీరోయిన్‌ త‌మ‌న్నా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.

 

`సీటీమార్` సెట్ లో గ్రాండ్‌గా స్టార్ హీరోయిన్‌ త‌మ‌న్నా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్`. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్ `జ్వాలారెడ్డి`గా న‌టిస్తున్న  స్టార్ హీరోయిన్‌ త‌మన్నా పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 21. ఈ సంద‌ర్భంగా `సీటీమార్` సెట్‌లో త‌మ‌న్నా ‌పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. యూనిట్‌ సభ్యుల నడుమ కేక్‌ కట్ చేసి బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు త‌మ‌న్నా. ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది, న‌టి భూమిక‌, చిత్ర నిర్మాత  శ్రీనివాసా చిట్టూరి, స‌మ‌ర్ప‌కులు ప‌వ‌న్‌కుమార్‌, హీరోయిన్ దిగంగ‌న సూర్య‌వంశీతో పాటు  చిత్ర యూనిట్ పాల్గొని త‌మ‌న్నాకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌ల‌చేసిన గోపీచంద్, త‌మ‌న్నాల లుక్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు  బ‌ర్త్‌డే సంద‌ర్భంగా  స్టార్ హీరోయిన్‌ త‌మ‌న్నాస్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.
ఈ చిత్రానికి..
సినిమాటొగ్ర‌ఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌,
సంగీతం: మణిశర్మ‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,
సమర్పణ: పవన్‌ కుమార్‌,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

 
Grand Birthday Celebrations Of Star Heroine Tamannaah On The Sets Of ‘Seetimaarr’

Aggressive Star Gopichand’s latest is ‘Seetimaarr’ Directed by Mass Director Sampath Nandi. Presented by Pavan Kumar and Produced by Srinivasaa Chhitturi under the Srinivasaa Silver Screen banner. This Sports-based film with a backdrop of mass game Kabaddi is being made with big budget and high technicalities . Star Heroine Tamannaah is playing the role of Jwala Reddy, A Coach to Telangana Women Kabaddi Team. She is celebrating her birthday on December 21st. The Team has celebrated her birthday in a grand manner on the sets of ‘Seetimaarr’. Tamannaah has cut the cake amidst unit members and celebrated her birthday. Hero Gopichand, Director Sampath Nandi, Actress Bhumika, Producer Srinivasaa Chhitturi, Presenter Pavan Kumar, Heroine Digangana Suryavanshi and all unit members were present and conveyed their wishes to Tamannaah. Looks of Gopichand and Tamannaah which were released so far have garnered superb response. Makers released a Special Birthday Poster for Tamannaah today on the occasion of her Birthday. Melody Brahma Mani Sharma is composing music for this film.  Gopichand will be seen as Kabaddi coach for the Andhra team and Tamanna as Telangana team Kabaddi coach. Another heroine Digangana Suryavanshi will be seen as a village girl while Posani Krishna Murali, Rao Ramesh, Bhumika, Rehaman, Bollywood actor Tarun Arora will be seen in other key roles.

Chief Technicians of this movie are
DOP: S. Soundar Rajan
Music Director: Mani Sharma
Editor: Thammiraju
Art Director: Satyanarayana D.Y.
Presented by: Pavan Kumar
Producer: Srinivasaa Chhitturi
The story, Screenplay, Dialogues, and Direction: Sampath Nandi