“ఫ్రెండ్ షిప్” (సింగ్ & కింగ్) టీజర్ విడుదల!!

“ఫ్రెండ్ షిప్” (సింగ్ & కింగ్) టీజర్ విడుదల!!

యాక్షన్ కింగ్ అర్జున్-క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్ “ఫ్రెండ్ షిప్” (సింగ్ & కింగ్) టీజర్ విడుదల!!

     ‘క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్’ కలయికలో…  25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం “ఫ్రెండ్ షిప్”. ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “ఫ్రెండ్ షిప్” పేరుతోనే.. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్ లైన్ జోడించి.. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ తెలుగులో నిర్మిస్తున్నారు.
     ఈ చిత్రం చివరి షెడ్యూల్
కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. మాజీ ‘మిస్ శ్రీలంక’ మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ ‘లోస్లియా’ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో..  ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది.
     నిర్మాత-శ్రీలక్ష్మి జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ… “ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించాను. నా కెరీర్ లో తొలిసారి “ఫ్రెండ్ షిప్” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. ఈ చిత్రం టీజర్ విడుదల చేశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
     ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మాటలు: రాజశేఖర్ రెడ్డి, సంగీతం: డి.ఎం.ఉదయ్ కుమార్, సినిమాటోగ్రఫీ:  శాంతకుమార్, నిర్మాత: ఏ.ఎన్.బాలాజీ, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య!!