First Look of Adivi Sesh’s Evaru: Mysterious and intriguing

First Look of Adivi Sesh’s Evaru: Mysterious and intriguing
First Look of Adivi Sesh's Evaru: Mysterious and intriguing
First Look of Adivi Sesh’s Evaru: Mysterious and intriguing

పివిపి సినిమా బ్యాన‌ర్‌పై అడివిశేష్ హీరోగా రూపొందుతోన్న  థ్రిల్ల‌ర్ `ఎవ‌రు` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`. `బ‌లుపు`, `ఊపిరి`, `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను గురువారం విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో అడివిశేష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత అడివిశేష్‌, పివిపి సినిమా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేస్తున్నారు. 

న‌టీన‌టులు:
అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు 
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు:  పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌:  జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌:  య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఒ:  కాకా.