‘ఆహా’లో రానా దగ్గుబాటి ‘నెం.1 యారి’ టాక్‌ షో బిగ్గెస్ట్‌ డిజిటల్‌ లాంచ్‌ !!

‘ఆహా’లో రానా దగ్గుబాటి ‘నెం.1 యారి’ టాక్‌ షో బిగ్గెస్ట్‌ డిజిటల్‌ లాంచ్‌ !!

‘ఆహా’లో రానా దగ్గుబాటి ‘నెం.1 యారి’ టాక్‌ షో బిగ్గెస్ట్‌ డిజిటల్‌ లాంచ్‌
 
బ్లాక్‌బస్టర్‌ హిట్‌ జాతిరత్నాలు టీమ్‌తో మార్చి 14న తొలి ‘నెం.1 యారి సీజన్‌ 3 తొలి ఎపిసోడ్‌ ప్రారంభం
 
 
బ్లాక్‌బస్టర్‌ సినిమాలు, ఆకట్టుకునే ఒరిజినల్స్‌, సక్సెస్‌ఫుల్‌ టాక్‌షోస్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో మ‌రో బిగ్గెస్ట్ టాఇక్‌ షో నెం.1 యారీతో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైంది. 
 
మార్చి 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు నెం.1 యారి షోతో ప్రేక్షకులను మెప్పించడానికి ఆహా సిద్ధమైంది. రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ‘జాతిరత్నాలు’.. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శిల కాంబినేషన్‌లో రానా దగ్గుబాటి హోస్టింగ్‌లో మార్చి 14 ఆదివారం రాత్రి 9 గంటలకు సీజన్‌ 3..తొలి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పాత్రికేయుల సమావేశం జరిగింది. బిగ్గెస్ట్‌ డిజిటల్‌ లాంఛింగ్‌ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో..
రానా దగ్గుబాటి మాట్లాడుతూ – “నేను చాలా షోస్‌కి గెస్ట్‌గా వెళ్లాను. అలాగే యారీ గేమ్‌ షోకు హోస్ట్‌గా పనిచేశాను. గెస్ట్‌గా ఉండటం కంటే హోస్ట్‌గా ఉండటమే సులభమని నాకు నెమ్మదిగా అర్థమైంది. ఎందుకంటే గెస్ట్‌గా ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. నెం.1 యారీ సీజన్‌ చేస్తున్నప్పుడు ఓ యాక్టర్‌కి, చూస్తున్న ప్రేక్షకుడికి మధ్య ఉన్న దూరం తగ్గించి వారికి దగ్గర కావాలనుకున్నాను. అలా స్టార్ట్‌ అయిన ఈ ప్రయాణంలో రెండు సీజన్స్‌ను పూర్తి చేశాను. ఇప్పుడు సీజన్‌ 3 ఆహాలో స్టార్ట్‌ చేశాను. ఇప్పటి వరకు చేసిన సీజన్స్‌కు డిఫరెంట్‌గా, కొత్తగా ఈ సీజన్‌ ఉంటుంది. మనలో చాలా మంది డబ్ల్యు డబ్ల్యు ఎఫ్‌ కార్డ్స్‌తో గేమ్స్‌ ఆడి ఉంటారు. అలాంటి ట్రంప్‌ కార్డ్‌ గేమ్‌ షోను సినీ స్టార్స్‌తో ఆడబోతున్నాం. పాత పాటలను కొత్త హిప్‌ హాప్‌ సాంగ్స్‌తో మిక్స్‌ చేసి ఇండిపెండెంట్‌ సాంగ్స్‌లా చూపించబోతున్నాం. సినిమాలో చూపించేది ప్రతిదీ ఈ గేమ్‌షోలో ఉంటుంది” అని తెలిపారు. ఈ సమావేశంలో ర్యాండమ్‌ ఫైర్‌ ప్రశ్నలకు రానా దగ్గుబాటి సరదాగా సమాధానాలు చెప్పారు. అలాగే మీడియా ప్రతినిధులతో ట్రంప్‌కార్డ్‌ గేమ్‌ను ఆడి ఆకట్టుకున్నారు.  ఈ కార్యక్రమంలో ‘ఆహా’ సీఈఓ అజిత్‌ సహా యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. 
 
నెం.1 యారి సెలబ్రిటీ టాక్ షోలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ అతిథులుగా వస్తున్నారు . మార్చి 11 న జరిగిన నెం.1 యారి విలేకరుల సమావేశం ఇప్పటివరకు అతిపెద్ద డిజిటల్ లాంఛింగ్‌గా సెన్సేషన్‌ అయ్యింది. 20 కి పైగా డిజిటల్ మాధ్యమాలు వారి సంబంధితన ఛానెల్స్‌లో ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఒకేసారి లైవ్ ప్రోగ్రామ్‌ను ప్రసారం చేశాయి.   ఈ టాక్ షోలో సౌతిండియన్‌ స్టార్స్‌ మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, విజయ్ దేవరకొండ, తమన్నా భాటియా.. తదితరులు హోస్ట్‌ రానాతో కనిపించి ప్రేక్షకాభిమానులను మెప్పించనున్నారు. 
 
రు.365 సబ్ స్క్రిప్షన్‌తో అతి కొద్ది సమయంలోనే తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ ప్రపంచంలో ఆహా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానించే సూపర్‌స్టార్స్‌ నటించిన క్లాసిక్‌ సినిమాల కలెక్షన్స్‌తోపాటు ఒరిజినల్స్ కలెక్షన్స్‌ ఆహా సొంతం.
 
First episode with team Jathi Ratnalu premieres on March 14, on Telugu OTT platform, aha.
 
The much awaited Season 3 of No 1 Yaari is back with Rana Daggubati as the host and aha has bagged the rights to stream it. From unique guests and fun segments, the makers have promised an all new season of Yaari. The promo was launched by Rana on his Twitter handle on 6 March. After a break of three years, the Baahubali-star is back with his talk show, which will premiere every Sunday on aha from 9 PM. The first episode to be out on March 14.
 
The celebrity talk show will see a slew of notable guests from the Telugu film industry. On March 11, the press conference for No 1 Yaari saw the biggest digital launch ever—with over 20 digital mediums streaming the program LIVE simultaneously on their channels. 10 media channels, 20 YouTube channels and 10 meme pages went LIVE on their handles during the press conference.
According to reports, Rana will interview popular South Indian celebrities like Megastar Chiranjeevi, Megapower Star Ram Charan, Vijay Devarakonda, Tamannaah Bhatia, among others on the show. 
 
With aha’s wide range of movies available at a discounted price of Rs 365 for the annual subscription, there’s no stopping unlimited Telugu entertainment anytime, anywhere. In a short span of time, aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites starring superstars and a huge library of classics and original web series, aha is constantly giving its viewers a lot to look forward to.