త్వరలో  ఫలక్ నుమా దాస్-2 తో షాక్ ఇస్తాం.. 

త్వరలో  ఫలక్ నుమా దాస్-2 తో షాక్ ఇస్తాం.. 

త్వరలో  ఫలక్ నుమా దాస్-2 తో షాక్ ఇస్తాం.. 

వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన  చిత్రం ‘ఫలక్ నుమా దాస్’. మాస్ కా దాస్ టాగ్ లైన్ తో   విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31న విడుదలై విశేష స్పందనను పొందుతూ భారీ కలెక్షన్స్ లను రాబడుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రంలో నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ… హైదరాబాద్ లోని  118 లొకేషన్స్ లలో తీసిన ఈ సినిమా అందరి మన్ననలు పొందుతూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.  దాదాపు రెండు సంవత్సరాలు గా స్క్రిప్ట్ వర్క్ చేసి ఎంతో కష్టపడి విశ్వకి ఈ ప్రాజెక్ట్ ను చేసాడు. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. 7 రోజుల్లో 7కోట్ల 50 లక్షలు వసూలు చేసింది అని చెప్పడానికి సంతోష పడుతున్నా.. ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. అలానే ఈ చిత్రం లో సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అంటున్నారు. అందుకే కొత్తగా ఎడిటింగ్ చేసాము. ఆ ల్యాగ్ ను తీసేసి సరికొత్తగా ప్రెసెంట్ చేస్తున్నాము. రేపటి నుంచి ఇది అమలు అవుతుంది. 50  థియేటర్స్ తో పాటు మల్టిప్లెక్స్ లు  కూడా పెరుగుతున్నాయి. ఇక మా నెక్స్ట్ చిత్రం ఫలక్ నుమా దాస్ 2 తో భారీ క్యాస్టింగ్ తో మరోసారి మీ ముందుకు వస్తామని తెలిపారు. నటుడు  ఉత్తేజ్ మాట్లాడుతూ..శివ సినిమాలో యాదగిరి, చందమామ సినిమా లో పాత్రల తరువాత అంత మంచి పేరు మళ్లీ ఈ ఫలక్ నుమా దాస్ లో చేసిన  పాత్రకు  వచ్చింది. మలయాళం లో వచ్చిన ‘అంగమాలై’ చిత్రాన్ని రీమేక్ చేసాడు. అయితే.. ఎక్కడా రీమేక్ అనే విషయం గుర్తుకు రాదు. జస్ట్ ఆ చిత్రాన్ని ఇన్స్పైర్ గానే తీసుకొని ఎంతో క్లారిటీ తో పక్కాగా సినిమాను తెరకెక్కించి నటించాడు విశ్వక్ సేన్. అతను పడిన కష్టం ఫలించి ఇంత పెద్ద రిజల్ట్ ను ఇచ్చింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్ అని చెప్పారు. సినిమా చూసిన మొదటి రోజే పూర్తి సంతృప్తి తో ఉన్నాను. అనుకున్న ఫలితం వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను అని  కో ప్రొడ్యూసర్ మాణిక్య రావు అన్నారు. ఇక హీరో మరియు ఈ చిత్ర దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఎన్నో జరిగాయి కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సినిమా అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఇకపై కూడా అవుతూనే ఉంటుంది. నా టీమ్ కోఆపరేషన్, కష్టం లేకపోతే సినిమా సక్సెస్ టాక్ వచ్చేది కాదు.  ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నా.. ఈ ఫలక్ నుమా దాస్ తో ధమ్కీ ఇచ్చా.. నా నెక్స్ట్ సినిమాతో షాక్ ఇస్తా.. అని తెలియచేసారు. 

హీరోయిన్ ప్రశాంతి,  జీవన్, యాస్వంత్, సంజయ్, టోనీ, కౌశిక్, కార్తిక్, వివేక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.