‘Dorasani’ producers Madhura Sreedhar & Yash Rangineni Interview

‘Dorasani’ producers Madhura Sreedhar & Yash Rangineni Interview

 

'Dorasani' producers Madhura Sreedhar & Yash Rangineni Interview

                         గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది….
                               నిర్మాతలు : మధుర శ్రీధర్ మరియు యశ్ రంగినేని

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ని హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ బిగ్ బెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ `దొరసాని`. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకునిగా పరిచయం అయిన ఈమూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధురశ్రీధర్, యశ్ రంగినేని మాట్లాడుతూ:

గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది:
మధుర శ్రీధర్ : ఇప్పుడున్న ప్రేమకథల బ్యాక్ డ్రాప్ కంటే భిన్నమైన బ్యాక్   డ్రాప్ లో కథను చెప్పాలనుకున్నప్పుడు అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి చేసిన రీసెర్చ్ చాలా ఉంది. అదే తెరమీద ప్రేక్షకులకు కొత్త అనుభూతలను ఇచ్చింది.

యశ్ రంగినేని: చాలా నెలలు కష్టపడి ఒక గడీని ఎంచుకున్నాం. మ్యూజిక్ ఈ కథనుమరో ఎత్తుకు తీసుకెళ్ళింది. చాలామందికి నచ్చింది మేము చాలా సంతోషంగా ఉంది.

ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథను అందించాడు కెవిఆర్ మహేంద్ర:

మధురాశ్రీధర్ : తెలుగు సినిమా చరిత్ర లో నిలిచిపోయే ప్రేమకథ ను తీసాడు. ఎలాంటి కమర్షియాలిటీలను మిక్స్ చేయకుండా ఒక పొయిటిక్ లవ్ స్టోరిని అందించాడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ కథను మరింత అందంగా మలిచాయి. మహేంద్ర కథకు బెస్ట్ ట్రీట్ మెంట్ అందించాడు.

నిబద్ధత ఉన్న హీరో ఆనంద్ దేవరకొండ:
ఫ్యామిలీ నుండి వచ్చిన ఇమేజ్ లను పట్టించుకోకుండా ఆనంద్ కథ ను సెలెక్ట్  చేసుకున్నాడు. తన కావాలనుకుంటే రెగ్యులర్ సినిమా తీసుకోవచ్చు. కానీ అతను ఈ పాత్రకోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అయ్యాడు. అది తెరమీద కనిపించింది. ఆనంద్ విషయంలో మేము చాలా గర్వంగా ఉన్నాం.

కథను గౌరవించాం:
యశ్ రంగినేని: కథ విన్నప్పుడే మేము తీసుకున్న నిర్ణయం ఇందులో ఏమీ ఫోర్స్ గా పెట్టకూడదు అని . అతను ప్రొపర్ గా స్ర్కిప్ట్ చేసి, అలాంటి పరిసరాలను  క్రియేట్ చేస్తున్నప్పుడు మేము అందులో ఎలాంటి  మార్పులను కోరలేదు. కొన్నిస్క్రీ న్ ప్లే  ఛేజెంస్ మాత్రమే చెప్పాం. కథను ఎక్కడా పొల్యూట్ కానివ్వలేదు.

ఇదికొత్త కథ కాదు:
యశ్ రంగినేని : పేదవాడు, గొప్పంటి అమ్మాయి కథలు పాతాళ భైరవినుండి చూస్తున్నాం. ఇది కొత్తకథ అనే దానికన్నా కొత్త ఎక్స్ పీరియన్స్  ప్రేక్షకులకు ఇచ్చేందుకే మేం ప్రయత్నించాం. అందులో మాకు ఎక్కవు ప్రశంసలే వినిపిస్తున్నాయి. నచ్చిన వాళ్ళు నాకు చెప్పిన మాటలు ఉత్సాహాన్నిస్తున్నాయి.  కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తే ఇప్పుడు నచ్చేవాళ్ళు కూడా ఇష్టపడే వాళ్ళుకాదు.

గడీలు దొరకమే కష్టం అయ్యింది:
మధుర శ్రీధర్: ఈ గడికోసం చాలా వెతికాం. కానీ ఎక్కడా మాకు దొరకలేదు. రెండు మూడు గడీలు చూస్తే అక్కడ పర్మిషన్ దొరకలేదు.  ఉపయోగంలో లేని గడినితీసుకొని దానిని బాగుచేసి షూటింగ్ చేసాం. ఇప్పడు ఆ గడీలో స్కూల్ రన్ అవుతుంది. దొరసాని చేసిన మేలులలో అది ఒకటి.

ఊహించిన విజయమే అందింది:
మధుర శ్రీధర్ :మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశంసలు అందుతున్నాయి. మౌత్  టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. తప్పకుండా మంచి విజయం దిశగా దొరసాని పరుగులు పెడుతుంది. పెళ్ళి చూపులు లాంటి విజయం అందుతుంది అని మా నమ్మకం.

కథ లో సంఘటనలు  నిజమే:
మధుర శ్రీధర్ :కథలో చాలా విన్న కథలు, చూసిన కథలే కనపడతాయి. ఇందులో ఫిక్షన్ కంటే వాస్తవ పరిస్థితులు ప్రభావమే దొరసాని కథపై పడింది. అందుకే వాస్తవ కథ అన్నాము. ఆంధ్రా తెలంగాణాలో సినిమా ని చూసిన ప్రేక్షకుల సంఖ్య మాకు ఆనందాన్నిచ్చింది. సినిమా కమర్షియల్ సక్సెస్ కి చాలా రీజన్స్ ఉంటాయి. దొరసాని సినిమ ఆడియన్స్ కు  బాగా దగ్గరవుతుంది.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్ మహేంద్ర