“Director” First Look Released !!

“Director” First Look Released !!

“డైరెక్టర్” ఫస్ట్ లుక్  విడుదల!!
 
తొలి చిత్రం “నాటకం” వంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకొని హీరోగా  ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని  సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆశిష్ గాంధీ… మలి చిత్రంగా  మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. శ్యామ్ మరొక హీరోగా  మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్ గా  మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లు పై కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ  దర్శకత్వంలో రూపొందుతోన్న “డైరెక్టర్” చిత్రాన్ని  ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు.   షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఆశిష్ గాంధీ కెరియర్ ని మలుపు తిప్పే చిత్రం ఇది!!
 
ఇప్పటివరకు తెలుగు తెరపైన ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి.. వస్తున్నాయి.. ఆడియెన్స్ కి నచ్చే, మెచ్చే చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి. అంతే కాదు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు అబ్బురపరిచే విజువల్స్ కథలో అనేక ట్విస్టులు ఉంటేనే అచిత్రం ప్రజాదరణ పొందుతుంది. అలాంటి చిత్రమే మా “డైరెక్టర్”. మా హీరో ఆశిష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రం ఆశిష్ కెరియర్ ని మలుపు తిప్పే చిత్రం అవుతుంది.. సాయి కార్తీక్ బ్యూటిఫుల్ బాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు… ఆదిత్య వర్ధన్ కెమెరా విజువల్స్ మా సినిమాకి వన్ ఆఫ్ ది  ఎస్సెట్ కానుంది. షూటింగ్ పూర్తయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ పనులు పూర్తిచేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము.. అని నిర్మాతలు నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల తెలియజేసారు.
 
 అన్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ తో వస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ !!
 
సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందిస్తున్న “డైరెక్టర్” చిత్రాన్ని మేము డైరెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా  టెక్నీకల్ టీం అందరూ ఎంతో సపోర్ట్ చేశారు.. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని అనుకున్న టైంలో పూర్తి చేసాం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ కోపరేషన్ మరువలేనిది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రంని నిర్మించారు. వారికి మా థాంక్స్. అలాగే మా హీరో ఆశిష్ గాంధీ నాటకం చిత్రం తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా  సెలెక్టెడ్ గా కథలను చూజ్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. మా కథ విని ఎంతో ఇంప్రెస్ అయి ఈ చిత్రం చేసాడు. డెఫినెట్ గా ఈ డైరెక్టర్ చిత్రం పెద్ద హిట్ అయి మా  టీం అందరికీ మంచి పేరు తెస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. అని చిత్ర దర్శకులు కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ అన్నారు.
 
ఆశిష్ గాంధీ, శ్యామ్ హీరోలుగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్ గా  నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ అప్పారావు, వీరభద్రం, తిరుమలరెడ్డి, ఆర్కే, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ  చిత్రానికి సంగీతం; సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య వర్ధన్, ఎడిటింగ్: బి . నాగేశ్వర్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి ఎల్ల, పి.ఆర్.ఓ.సాయి సతీష్, నిర్మాతలు: నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల, రచన-దర్శకత్వం: కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ.
 
“Director” First Look Released !!
 
Versatile actor Ashish Gandhi, who proved himself with a different genre film Natakam that marked his debut as hero is coming up with another suspense thriller. Karthik is another lead actor, while Mairina Singh, Aishwarya Raj Bhakuni and Antra Raut will be seen as heroines in the film directed by Kiran Ponnada & Karthik Krishna and produced jointly by Nagam Tirupathi Reddy & Srikanth Deepala under the banners of Vision Cinemas and Deepala Arts. The film’s shoot is wrapped up and currently post-production works are underway.
 
This movie will be a career game changer for Ashish Gandhi!!
 
So far, Telugu film industry witnessed many suspense thrillers. Among them, films those enthralled audience became super hits. In fact, audiences are encouraging films which will have never seen before engaging scenes with many twists and turns in the narration. The film “Director” falls under the category. “The character is designed as per the body language of our hero Ashish Gandhi. This will definitely be a career game changer for him. Sai Kartheek is providing wonderful background score. Adithya Vardhan’s cinematography will be one of the major assets of our film. Shooting has been completed. Post production works are currently underway. We are planning to release the film soon after completing all the works,” said producers Nagam Tirupathi Reddy and Srikanth Deepala.
 
It’s a different thriller with an unexpected story!!
 
We are very happy to direct the suspense thriller film “Director”. Our technical team was very supportive. With the cooperation of everyone, we have completed the shoot of this film on time. Especially, our Producers support is remarkable. They didn’t compromise on budget as well for the best quality. Special thanks to them. Likewise, our hero Ashish Gandhi is doing films selectively, though he got many offers after his first film Natakam. He was very impressed with our story and did this film with special interest. We are confident enough that the film “Director” will become a super hit and bring good name to all of us. I would like to thank each and every person who worked for this film day in and out,” said film directors Kiran Ponnada and Karthik Krishna.
 
The film starring Ashish Gandhi, Karthik as heroes and Mairina Singh, Aishwarya Raj Bhakuni and Antra Raut as the heroines also features Jabardasth Apparao, Veerabhadram, Thirumala Reddy, RK and others in important roles.
 
Here’s technical crew:
Directors: Kiran Ponnada and Karthik Krishna
Producers: Nagam Tirupathi Reddy and Srikanth Deepala
Banners: Vision Cinemas and Deepala Arts
Music Director: Sai Kartheek
Cinematography: Adithya Vardhan
Editing: G. Nageshwar Reddy
Co-Producer: Thirumal Reddy Yalla
PRO Sai Sathish