గుణ‌శేఖ‌ర్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `శాకుంత‌లం` షూటింగ్‌ ప్రారంభం !!

గుణ‌శేఖ‌ర్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `శాకుంత‌లం` షూటింగ్‌ ప్రారంభం !!

దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ‌శేఖ‌ర్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `శాకుంత‌లం` షూటింగ్‌ ప్రారంభం !!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పౌరాణి్క‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్నఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ నివ్వ‌గా, సూప‌ర్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

డైన‌మిక్ డైరెక్ట‌ర్ గుణ శేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు శాకుంతలం అనే ప్యాన్ ఇండియా‌ సినిమాని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఆర్పీ గుణ టీం వర్క్స్ (దిల్ రాజు ప్రొడక్షన్స్ అండ్ గుణ టీం వర్క్స్) కలిసి సంయుక్తంగా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా దిల్ రాజు వంటి మేకర్ ఈ సినిమాకు వెన్నుతట్టి అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. నా లాంటి ఒక ద‌ర్శ‌కుడికి దిల్‌రాజులాంటి మేక‌ర్ ప్రాత్సాహం ఉంటే ఆ సినిమా మేకింగ్, నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. దిల్ రాజు గారు నాతో చేతులు కలపడం ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రథమ పుత్రిక నీలిమ గుణ. త‌ను ఆర్ట్స్ అండ్ విజువల్ కల్చర్‌లో మాస్టర్స్ చేసింది. ఈ మూవీతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి దిల్‌రాజు ప్రోత్సాహం మ‌రింత ఆనంద‌దాయ‌కం. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం చేయడమంటే మామూలు విషయం కాదు. శాకుంతలం సినిమాలో శకుంతలగా ఎవరు నటిస్తారని ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ సున్నితత్త్వం ఎవరికి ఉంది? అనుకుంటుండగా..ముఖ్యంగా ప‌బ్లిక్ నుండి చాలా విశేషంగా నాకు సమంత పేరు అందరూ సూచించారు. ఆమె చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటారు. ఈ కథ వినడంతోనే ఓకే చెప్పారు. శాకుంతలం సినిమాలోని శ‌కుంత‌ల‌ భావాలను త‌ను అర్థం చేసుకోవ‌డం త‌న‌లో శ‌కుంత‌ల‌ను చూసుకుని ఇలాంటి పాత్ర‌లో న‌న్ను నేను చూసుకోవ‌డానికి సిద్దంగా ఉన్నాను ఎలాంటి ఎఫ‌ర్ట్ కావాల‌న్నా పెడ‌తాను అని దీని కోసం నాలుగు నెలల క్రితమే అన్నింటిని నేర్చుకున్నారు. క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకున్నారు. స్టోరీలో డెవలప్ మెంట్స్, పూర్తి స్క్రిప్ట్ వింటూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు. దిల్ రాజు వంటి మేకర్, సమంతగారి లాంటి నటి ఉన్నప్పుడు క‌చ్చితంగా మ‌నం అనుకున్నవిధంగా సినిమాను తీయ‌గ‌లం అన్న న‌మ్మ‌కం క‌లిగింది. ముఖ్యంగా ప్రణయ కావ్యం, క్లాసికల్ సినిమాతోనే నిర్మాత‌గా పరిచయం కావాలనే నీలిమ ధృడంగా నిశ్చయించుకుంది. సమంతగారి పేరుని త‌నే మొదటగా అనుకుంది. వ్యాపార దృష్టితోనే కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజుగారు ఈ సినిమాకు ఎంత బ‌డ్జెట్ అయితే అంత‌ ఖర్చుపెట్టండి మీ వెన‌కాల నేను ఉన్నాను అని అన్నారు. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ గారిని కూడా నీలిమనే సెలెక్ట్ చేసింది. కథ గురించి అంతా తెలుసుకుని ఓకే చెప్పారు. సినిమాకు కావాల్సిన హార్స్ రైడింగ్‌, స్వోర్డ్‌ ఫైటింగ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు. రేపు వీరిద్ద‌రూ సినిమాలో శకుంతలా? దుష్యంతుడా? అనేలా పోటాపోటీగా ఉంటారు“ అన్నారు

సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సమంత మేనేజర్ మ‌హేంద్ర వచ్చి నాతో శాకుంతలం సినిమా గురించి చెప్పాడు. గుణ శేఖర్ మళ్లీ నిర్మాతగా ఎందుకు చేస్తున్నారు.. ఆయన వెనక ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నాను, మీరు ఉంటారా స‌ర్ అని అన్న‌ప్పుడు స‌రే కాని నేను క‌థ వినాలి అని చెప్పాను. ఒక్కడు సినిమా రిలీజ్ రోజు సత్యం థియేటర్లో చూశాను. అలాంటి సినిమా ఒకటి తీయాలని కలలు కన్నాను.. కానీ తీయలేకపోయాను. ఇలాంటి సినిమాలు తీయాలనే కోరిక అప్పుడే మొదలైంది. శాకుంతలం లాంటి హిస్టారికల్ సినిమాను తీయడం మామూలు విషయం కాదు. సమంత ఆల్రెడీ కథకు ఓకే చెప్పింది కాబట్టి.. గుణ శేఖర్ కథ చెప్పేటప్పుడే సమంతను శ‌కుంత‌ల‌గా ఊహించుకున్నాను. అన్నీ ఎమోషన్స్‌ బాగా కుదిరాయి. ఎమోషన్స్ పరంగా చాలా సన్నివేశాలు అదిరిపోయాయి. సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్తాను అని గుణ శేఖ‌ర్ అన్నారు. నాలుగు నెలల నుంచి దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. గుణశేఖ‌ర్ ఈ సినిమాతో త‌న కూతురిని నిర్మాతగా ప‌రిచ‌యం చేస్తున్నారు. వారి వెనుక నేనున్నాను. 2022లో ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక దుష్యంతుడిగా ఎవరు అని అనుకుంటున్న సమయంలో ఓ ఫోటో షూట్‌ చూడమని గుణ శేఖర్ రమ్మన్నారు. దేవ్ మీద చేసి ఫోటో షూట్ చూపించారు. ఆ గెట‌ప్‌లో నిజంగా కింగ్‌లాగే ఉన్నాడు. మంచి దుష్యంతుడు దొరికాడు అనుకున్నాను. గుణ శేఖర్‌కు తగ్గ టీం దొరికింది. అద్భుతమైన సినిమా మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తాం’`అన్నారు.

చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నా మొదటి సినిమా. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు అల్లు అర‌వింద్‌గారికి నా ధ‌న్య‌వాదాలు. స‌మంత‌,హ‌న్షిత చాలా స‌పోర్ట్ చేస్తున్నారు“ అన్నారు.

హీరో దేవ్ మోహన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఓ రాజుగా దుష్యంతుడి పాత్రలో కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది. గుణ శేఖర్ లాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. అసలు సిసలు నిర్మాత దిల్‌రాజుగారు మా వెనక ఉన్నారు. మీరు కూడా నన్నుఆదరిస్తారని అనుకుంటున్నాను. సమంతతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఎంతో సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడిక‌ల్‌ రోల్, రాజకుమారి పాత్రలను చేయాలని అనుకున్నాను. ఇప్ప‌టికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి. దిల్ రాజు గారు, గుణ శేఖర్ గారు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. వంద శాతం నేను చేయాల్సింది చేస్తాను. గుణ శేఖర్ గారు ప్రతీ సీన్‌ను అద్భుతంగా చెప్పారు. రిఫరెన్సెస్ అడిగితే కూడా లేదని నీలిమ చెప్పింది. అంతా దర్శకుడి మైండ్‌లోనే ఉందని అన్నారు. ఈ పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ నా రేంజ్‌ను మించి ఉంది… అయినా సరే నేను నా ప్రయత్నం చేస్తాను’ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు కుమార్తె హ‌న్షిత రెడ్డి పాల్గొన్నారు.
స‌మంత అక్కి‌నేని, దేవ్ మోహ‌న్ మ‌రియు భారీ తారాగ‌ణం న‌టిస్తోన్నఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: శేఖ‌ర్ వి జోసెఫ్‌. సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: అశోక్ కుమార్‌, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా, డైలాగ్స్‌: సాయి మాధ‌వ్ బుర్రా, లిరిక్స్‌: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి, కొరియోగ్రాఫ‌ర్‌: రాజు సుంద‌రం, పిఆర్ఓ: బి.ఎ.రాజు, విఎఫ్ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌, అల‌గ‌ర్‌స‌మీ, స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌: వెంక‌ట్‌, మేక‌ప్ చీఫ్‌: రాంబాబు, కాస్ట్యూమ్ చీఫ్‌: అశోక్‌, సౌండ్ డిజైన‌ర్‌: బిస్వ‌దీప్ చ‌ట‌ర్జీ, ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ధ‌ని ఏలే, స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్: దాసు, డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌: అనిల్ కుమార్‌, కృష్ణ చైత‌న్య‌, జానీ షేక్ యాకూబ్‌, అకిల్ కృష్ణ‌, సూర్య కిర‌ణ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: య‌శ్వంత్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హేమంబ‌ర్ జాస్తి, స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు, నిర్మాత‌: నీలిమ గుణ‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: గుణ‌శేఖ‌ర్‌.

Dil Raju’s Presentation, Guna Sekhar’s Pan-India Project ‘Shakuntalam’ Shooting Begins

Dynamic Director GunaSekhar who is well known for Mythological and Commercial films is now coming with a pure love story based on Adiparvam titled ‘Shakuntalam’. This Pan-Indian film is being presented by Dil Raju Produced by Neelima Guna under DRP- Gunaa Teamworks Banner. Star Heroine Samantha Akkineni is playing the titular role of Shakuntala while Malayalam hero Dev Mohan will be seen as Dushyanth. This film is launched with Pooja Ceremony at Annapurna Studios in Hyderabad. Ace Producer Allu Aravind gave the first clap while Super Successful Producer Dil Raju has switched on the camera. The team held a media meet on this occasion.

Dynamic Director Guna Sekhar said, ” I am very glad to launch the pan-India project, ‘Shaakuntalam’ today. Very happy that it is being collectively produced by DRP – Gunaa Teamworks (Dil Raju Productions and Gunaa Teamworks). Especially, a maker like Dil Raju garu stands as a big support for this film in all aspects is very encouraging. Everyone knows how good the making and production values of a film will turn out to be if a Director like me gets support from a maker like Dil Raju garu. I am very happy that Dil Raju garu joined hands with me for ‘Shakuntalam’. It’s not an easy task to do a heroine-oriented film. There were many stories about who will do the role of Shakuntala in the ‘Shakuntalam’ movie. That role needs an actress with delicacy. I got suggested the name of Samantha by the public themselves. She is very selective in stories. She okayed this film instantly after listening to the script. She understands Shakuntala’s role completely and She wanted to reinvent herself in the role of Shakuntala. Samantha has put in all her efforts and learned everything needed for this film four months ago itself. She learned classical dances too. She gets herself involved completely by listening to story developments and complete script. I got the confidence that I can make the film as per my visualization when we have a maker like Dil Raju garu and an actress like Samantha with us. Neelima is very strong that she will debut as a producer with a timeless classical love story. She is the first person who wished for Samantha to do this film. Irrespective of the business angle, Dil Raju garu said to go on with whatever budget we need to make a very good film. Neelima selected Dev Mohan as Dushyanth. He okayed after knowing everything about the story. He trained in horse riding and sword fighting for this film. You will witness real Shakuntala and Dushyanth in the film.”
Super Successful Producer Dil Raju said, ” Samantha’s manager Mahindra approached me about ‘Shakuntalam’. I came to know that GunaSekhar Garu is Producing the film himself. I wished someone should back him and told the same to Mahindra. He asked me whether I join the project. I told him, okay but I need to listen to the story first. I watched the ‘Okkadu’ film in Sathyam Theatre on its release day. I wished to make a film like that. But, my wish didn’t fulfill. My desire to make these kinds of films started there. It’s not an easy task to do a historical film like ‘Shakuntalam’. By then, Samantha has okayed the film. So, I imagined her while listening to the story narrated by GunaSekhar. All emotions are well set in the story. Some scenes are too good with perfect emotions. GunaSekhar said that he will take the film to another level. The film’s works are going on for four months. GunaSekhar is introducing his daughter Neelima as the producer of this film. I stand behind them. We are planning to release this film in 2022. While we are searching for Dushyanth, GunaSekhar asked me to come to watch a photoshoot. He showed me the photoshoot shot on Dev. He really looks like a king. I felt we find the perfect actor for the Dushyanth role. A perfect team is set for GunaSekhar. We will try our best to make a wonderful film.”

Producer Neelima Guna said, ” This is my first film as a producer. I seek your support and blessings. Thanks to Allu Aravind garu for gracing this event. Samantha and Hanshitha are giving very good support.”

Hero Dev Mohan said, ” I am very happy to get introduced to Telugu Film Industry. I am glad to do the role of a King, Dushyant. Very proud to work with a director like GunaSekhar. Stalwart Producer Dil Raju Garu is our main pillar of support. I wish you all will support me. Very happy to work with Samantha.”

Star Heroine Samantha Akkineni said, ” I always have a small dissatisfaction. I felt like I am not able to do some kind of role. I did all kinds of roles like Romantic, Villain, Action… But my dream role is a periodical, the role of a Princess. I still watch Disney films. It’s a great gift to me to offer this role to me during this point of my career. DIl Raju garu and GunaSekhar garu gave me a wonderful opportunity. I will give my 100 percent for this film. GunaSekhar garu narrated every scene superbly. When I asked about references, Neelima said that there are none. Everything comes from Director’s imagination. I am very glad to do this role. The budget of this film is beyond my films But I will do whatever I can for this film.”

Dil Raju’s daughter Hanshitha Reddy attended this event.

Samantha Akkineni, Dev Mohan, and the Prominent cast will feature in this film.
Cinematographer: Sekhar V. Joseph, Music: Mani Sharma, Art Director: Ashok Kumar, Editing: Prawin Pudi, Costume Designer: Neeta Lulla, Dialogues: Sai Madhav Burra, Lyrics: Chaitanya Prasad, Sree Mani, Choreographer: Raju Sundaram, PRO: B.A. Raju, VFX Supervisor: Alagar Saamy, Stunt Choreographer: Venkat, Makeup Chief: Ram Babu, Costume Chief: Ashok, Sound Designer: Biswadeep Chatterjee, Publicity Designer: Dhani Aelay, Still Photographer: Daasu, Direction Department: Anil Kumar, Krishna Chaitanya, Johnny Shaik Yakub, Akil Krishna, Surya Kiran, Line Producer: Yashwanth, Executive producer: Kommineni Venkateswara Rao, Executive P
Producer: Hamambar Jasti,
Presented By Dil Raju
Produced By Neelima Guna
Written & Directed By GunaSekhar