ఘనంగా దిల్ రాజు పుట్టిన రోజు వేడుక‌లు

ఘనంగా దిల్ రాజు పుట్టిన రోజు వేడుక‌లు

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. దిల్ రాజు త‌న 50వ వ‌సంతంలోకి అడుపెట్టిన సంద‌ర్భంగా త‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో ప‌లువురు టాలీవుడ్ హీరోలు సంద‌డి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాన్, రామ్‌చ‌ర‌ణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌, రామ్‌, వ‌రుణ్‌తేజ్‌, నాగ‌చైత‌న్య స‌మంత‌, నితిన్‌, వ‌రుణ్ తేజ్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, రాశిక‌న్నా, పూజ‌హెగ్డే, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ విశ్వ‌క్‌సేన్, యాశ్ ల‌తో పాటు ప‌లువ‌రు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ వేడుక‌ల్లో పాల్గొని దిల్ రాజ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.