క్లూ మూవీ రివ్యూ

క్లూ మూవీ రివ్యూ

క్లూ మూవీ రివ్యూ

 


 

 సస్పెన్స్ త్రిల్లర్ అంశాలతో పాటు సోసియో ఫాంటసీ కంటెంట్ తో రూపొందిన చిత్రం క్లూ . టైటిల్ తో పాటు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యింది. మరి థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం రివ్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం …

 స్టోరీలోకి వెళితే …
మనం నిద్రిస్తున్నపుడు కలలు రావడం సహజం. ఒకే కల మళ్లీ మళ్లీ రావడం అంటే కొంత ఆలోచింప చేసే విషయమే. మనకు వచ్చే కలకు.. మనం చేస్తున్న పనికి దగ్గరి సంబంధం ఉంటే.. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ఉంటుంది. అలాంటిదే ఆసక్తిని కనబరిచే కథాంశమే ‘క్లూ’. కథలోకి వెళితే పురావస్తు శాఖలో హరగోపాల్‌ (మధు నంబియార్‌) పనిచేస్తాడు. హరగోపాల్‌కు గత జన్మలో ఒక రాజ్యంలో దాచిన గుప్త గుప్త నిధుల గురించిన కలలు వస్తుంటాయి. రాజ్యం మరియు గుప్త నిధికి సంబంధించిన కలలు మళ్లీ మళ్లీ రావడంతో కొంత ఆదోళనకు గురి అవుతాడు.  హరగోపాల్‌ ఆ నిధిని కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. తన అధికారులతో నిధి అన్వేషణ బయలుదేరుతాడు. ఇంతకు అని నిధి ఎక్కడ నిక్షిప్తమై ఉంది..? హరగోపాల్‌ ఆ నిధిని గుర్తించాడా..? నిధిని  గుర్తించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? నిధిని ఏం చేశారో తెలియాలంటే ‘క్లూ.. జర్నీ బిగెన్స్‌’ సినిమా చూడాల్సిందే.

 టెక్నిషన్స్
‘క్లూ’ చిత్రంలో వచ్చే ప్రతి సన్నివేశం కూడా ఆ తర్వాత వచ్చే సన్నివేశంపై క్యూరియాసిటి పెంచుతుంది. ఒక మంచి సోషియో ఫ్యాటసీ కథాంశంలో దర్శకుడు రమేష్‌ రానా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రంలో చివరి వరకు కూడా సస్పెన్స్‌ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అత్భుతంగా తెరకెక్కిండచాడు. నిధిని కనుగొనే క్రమంలో చాలా సీన్లు నేచురల్‌గా ఉంటాయి.
నటీనటులు:
ఈ చిత్రానికి పృథ్వీ శేఖర్‌ హీరోగా పరిచమయ్యాడు. కొత్త హీరో అయినప్పటికి ఒక హిస్టారికల్‌ మూవీలో రాజు పాత్రలో అత్భుతంగా నటించాడు. స్వతహాగా పృథ్వీ శేఖర్‌ ఫైట్‌ మాస్టర్‌ కావడంతో స్టంట్స్‌ ఇరగదీసాడు. దర్శకుడి కథ.. హీరో నటన ఈ సినిమాకు ప్రధానం. హీరోయిన్‌ సబినా  జాస్మిన్‌ రియా పాత్రలో నటించింది. ఈ ఇద్దరి జంట చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. గంధర్వ , సీతా రామం ఫేం మధు నంబియార్  తన పెరఫార్మెన్సు తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాడు. పోలీసు పాత్రలో దేవ్‌ గిల్‌ చాలా బాగా నటించాడు. నటుడు రాజా రవీంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ పాత్రలో నటించి మెప్పించాడు. స్వామీజి పాత్రలో షయాజీ షిండే  ఆకట్టుకున్నాడు. నటులు రూబీ, జీవా తదితరులు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అనాలసిస్ :
నిధి అన్వేషణలో భాగంగా అటవీ ప్రాంతంలో తెరకెక్కించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో కాస్టూమ్స్‌, కొన్ని లాజిక్‌లేని సీన్లు మరియు ఆర్ట్‌ వర్క్‌ కొంత వరకు నిరాశపరిచినా.. ‘క్లూ’ ఒక మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. సినిమాలో గ్రాఫిక్స్‌ చాలా బాగున్నాయి. విజువల్‌ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. అలాగే  ర్యాప్‌ రాక్‌ షకిల్‌ అందించిన సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అత్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లాయి.  సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో.. మంచి గ్రాఫిక్స్‌తో… సూపర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో.. ఆద్యంతం  ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు రమేష్‌ రానా. వెరైటీ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది . డోంట్ మిస్ గో అండ్ వాచ్ .
Rating: 3.25/5