భీమ‌వ‌రంలో బీ యునిక్ స్టోర్ ప్రారంభం సినీ న‌టి సుర‌భి సందడి

భీమ‌వ‌రంలో బీ యునిక్ స్టోర్ ప్రారంభం సినీ న‌టి సుర‌భి సందడి

భీమ‌వ‌రంలో బీ యునిక్ స్టోర్ ప్రారంభం సినీ న‌టి సుర‌భి సందడి

భీమ‌వ‌రం, నవంబర్ 30 : భీమ‌వ‌రంలోని మావుళ్ల‌మ్మ గుడి ద‌గ్గ‌ర‌లోని కురిశెట్టివారి వీధిలో బీ యునిక్‌ స్టోర్ ను సినీ న‌టి సుర‌భి సోమ‌వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ స్టోర్ ఓపెనింగ్‌కు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఈ స్టోర్లో అన్ని రకాల ఫ్యాషన్ వస్త్రాలు ఉండటం ఒక ప్రత్యేకతన్నారు. బీ యునిక్ స్టోర్లో షాపింగ్ చేసుకొని రాబోయే పండగల సంతోషాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలని కోరారు. గోదావరి జిల్లాలంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌న్నారు. ఈ స్టోర్ దిన‌దినాభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించారు.

మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎం శ్యామ‌ల మొద‌టి కొనుగోలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ స్టోర్‌లో వ‌స్తువులు అన్నీ చూశాన‌ని, అన్ని మంచి క్వాలిటీగా ఉన్నాయ‌న్నారు. క్వాలిటీ వ‌స్తువులతో వినియోగ‌దారుల ఆద‌రాభిమానాలు చూర‌గొనాల‌ని కోరారు. బీ యునిక్ స్టోర్ ఎండీ ఎం సీతా మాధురి మాట్లాడుతూ వ‌న్ గ్రామ్ జ్యూయ‌ల‌రీ, ఫ్యాష‌న్ జ్యూయ‌ల‌రీ, టాప్స్‌, లెగ్గింగ్స్‌, లాంగ్ వేర్‌, ఇన్న‌ర్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్‌, పౌచెస్‌, కాస్మోటిక్స్ ల‌భించున‌ని తెలిపారు. అన్ని వ‌స్తువులు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచామ‌ని పేర్కొన్నారు. మహిళల మనసు దోచే వివిధ ర‌కాల చీర‌ల‌కు ఈ షాపు నిలయమన్నారు. యువత ఇష్టపడే సంప్రదాయ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అల‌య‌న్స్ క్ల‌బ్ పీడీజీ అల్లు వ‌న‌జాక్షి కుమారి, బ్యూటీ థెర‌పిస్టు, కాస్మాటాల‌జిస్టు ఎస్ మ‌ణి, చీఫ్ అడ్వ‌యిజ‌ర్ రాధిక డెక‌ర్స్‌, బీ యూనిక్యూ స‌న్నిధి సువ‌ర్ణ ల‌క్ష్మి, భార‌తీయ విద్యా భ‌వ‌న్స్‌ ప్రిన్సిపాల్ ఎల్ వీ ర‌మాదేవి, వాస‌వీ వ‌నితా క్ల‌బ్ అధ్య‌క్ష‌రాలు అక్షింత‌ల ల‌క్ష్మీ కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సుర‌భి సందడి
సినీ న‌టి సుర‌భి బీ యునిక్ స్టోర్ ప్రారంభానికి వస్తోందని తెలియడంతో ఆమె అభిమానుల్లో కోలాహాలం నెలకొంది. అయితే, కోవిడ్ నిబంధనలు ఉండటంతో అందరూ మాస్కులు ధరించి ఉదయం నుంచి ఆ ప్రాంతంలో బారులు తీరారు. అభిమానులు కేరింతలతో సందడి చేశారు. స్టోర్ ప్రారంభం అనంతరం బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. హాయ్ భీమ‌వ‌రం పీపుల్‌ అంటూ అభిమానుల్లో ఉత్సాహాం నింపారు.