బ‌స్తీ బామ‌గా లావ‌ణ్య‌

బ‌స్తీ బామ‌గా లావ‌ణ్య‌

గ్లామ‌ర్ గార్ల్‌… సొట్ట‌బుగ్గ‌ల మిల్కీ సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి బ‌స్తీ బామ మ‌ల్లిక‌గా చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో సంద‌డి చేయ‌నుంది. కార్తీకేయ క‌థానాయ‌కుడిగా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి పుట్ట‌న రోజు సంద‌ర్భంగా ఆమె ప్రాత్ర‌కు సంబంధించి కొత్త లుక్‌ని విడుద‌ల చేశారు. చిత్రంలో కార్తికేయ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలున్నాయి.