రాజమండ్రి శ్యామల థియేటర్లో “అరణ్య”ప్రీ రిలీజ్ ఈవెంట్ !!

రాజమండ్రి శ్యామల థియేటర్లో “అరణ్య”ప్రీ రిలీజ్ ఈవెంట్ !!

రాజమండ్రి శ్యామల థియేటర్లో “అరణ్య”ప్రీ రిలీజ్ ఈవెంట్ !!

ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై దగ్గుబాటి రానా హీరోగా నటించిన “అరణ్య”చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 19 న రాజమండ్రి శ్యామల థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ అకాడమి డైరెక్టర్ మూర్తి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశ రావు పాల్గొన్నారు. సురేష్ మూవీస్ (రాజమండ్రి) మేనేజర్ పి. రమేష్ స్వాగతం పలుకుతూ మార్చి 26న ఈ చిత్రం విడుదల అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రం ద్వారా అడవుల సంరక్షణ, తద్వారా వన్యప్రాణుల ను రక్షించడం తెలియజేసే ప్రయత్నం శుభ పరిణామంగా పేర్కొన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అరణ్య సినిమా ద్వారా “రానా”సమాజానికి మంచి సందేశాన్ని అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సత్య రంగయ్య, శ్యామల థియేటర్ మేనేజర్ చిట్టి బాబు, రానా ఫాన్స్ జిల్లా అధ్యక్షులు బూర వీర వెంకట హనుమంతు, రాష్ట్ర కార్యదర్శి కొరిమెల్ల రాజశేఖర్ మరియు రానా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.