ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న “అక్షర”

   ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న “అక్షర”

నందితశ్వేతా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్
టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ
అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్
కాబోతుంది..

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: మా “అక్షర” సినిమాను ఫిబ్రవరి 26న
రిలీజ్ చేస్తున్నాం.  సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా
‘‘అక్షర’మూవీ’ రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్
కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా
పడింది.ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను
థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పటికే
సగం బిజినెస్ అయిపోయింది.ఇంకా మంచి ఆఫర్ లు వస్తున్నాయి  ఎంటర్ టైన్మెంట్
ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో
చర్చించబోతున్నాం.ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన
సినిమా ఇది.అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది ’’ అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్,
షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్ :  గంగాధర్, రాజు ఓలేటి
పి.ఆర్.ఓ :  జియస్ కె మీడియా,
కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్
నిర్మాణ సంస్థ :  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.