అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ !!

అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ !!

అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆకాష్ పూరి ‘రొమాంటిక్’

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న  రొమాంటిక్ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనుకున్నదానికంటే ఓ వారం ముందుగానే సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్‌లో కేతిక శర్మ.. ఆకాష్ పూరి ఇద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యేట్టు కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని పూరి  జగన్నాథ్ నిర్మించడమే కాకుండా.. కథను, మాటలు, స్క్రీన్ ప్లేను అందించారు. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘రొమాంటిక్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండగా.. నరేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.

మేకర్స్ ఇప్పటి వరకు మూడు పాటలను రిలీజ్ చేశారు. అన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.

తారాగ‌ణం:
ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ట‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సునైన‌

సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌,స్క్రీన్‌ప్లే,డైలాగ్స్: పూరిజగ‌న్నాథ్
ద‌ర్శ‌కత్వం: అనిల్ పాదూరి
నిర్మాత‌లు: పూరిజ‌గ‌న్నాధ్‌, ఛార్మీ కౌర్‌
స‌మ‌ర్ప‌ణ‌: లావ‌ణ్య‌
బేన‌ర్స్‌: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్
సంగీతం: సునిల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫి: న‌రేష్‌
ఎడిట‌ర్: జునైద్ సిద్దిఖీ
ఆర్ట్‌:  జానీ షేక్‌
లిరిక్స్‌: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఫైట్స్: `రియల్` స‌తీష్‌
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్